తిలక్‌ వర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. బోణీ కొట్టిన హైదరాబాద్‌ | Sakshi
Sakshi News home page

SMT 2023: తిలక్‌ వర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. బోణీ కొట్టిన హైదరాబాద్‌

Published Mon, Oct 16 2023 6:12 PM

 Syed Mushtaq Ali Trophy 2023: Hyderabad beat Meghalaya - Sakshi

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో హైదరాబాద్‌ బోణీ కొట్టింది. ఈ టోర్నీ గ్రూపు-ఏలో భాగంగా రాజస్తాన్‌ వేదికగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 119 పరుగులు మాత్రమే చేసింది. మేఘాలయ బ్యాటర్లలో లారీ సంగ్మా(46) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హైదరాబాద్‌ బౌలర్లలో రవితేజ 3వికెట్లు పడగొట్టగా.. మిలాంద్‌, అంకిత్‌ రెడ్డి తలా వికెట్‌ సాధించారు.

అదరగొట్టిన తన్మయ్‌, తిలక్‌ వర్మ..
అ‍నంతరం 120 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 13.2 ఓవర్లలో ఛేదించింది. హైదరాబాద్‌ బ్యాటర్లలో తన్మయ్‌ అగర్వాల్‌(46 నాటౌట్‌), కెప్టెన్‌ తిలక్‌ వర్మ(31 బంతుత్లో 41 నాటౌట్‌) మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. తిలక్‌ వర్మ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. తొలిసారి హైదరాబాద్‌ జట్టుకు తిలక్‌ వర్మ సారథ్యం వహిస్తున్నాడు. కాగా తిలక్‌ వర్మ భారత సీనియర్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: మిచెల్‌ స్టార్క్‌ క్రీడా స్పూర్తి.. రనౌట్‌ చేసే అవకాశమున్నా! వీడియో వైరల్‌

Advertisement
Advertisement