Suryakumar Yadav: సూర్యకుమార్‌ సెంచరీ.. ఏ మాత్రం తగ్గని జోరు

Suryakumar Yadav T20 Century Vs New Zeland 2nd T20 Match - Sakshi

టీమిండియా నయా సంచలనం సూర్యకుమార్‌ యాదవ్‌ అద్బుత సెంచరీతో మెరిశాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టి20లో చెలరేగిన సూర్యకుమార్‌ 49 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సూర్య ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌ టీమిండియా తరపున రెండో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కాగా అదే జోరును న్యూజిలాండ్‌ గడ్డమీద కూడా చూపించాడు.

ఇక న్యూజిలాండ్‌ గడ్డపై కూడా ఒక టీమిండియా బ్యాటర్‌ టి20ల్లో సెంచరీ చేయడం ఇదే తొలిసారి. అంతేకాదు టీమిండియా తరపున కూడా సూర్యకుమార్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సూర్యకుమార్‌కు టి20ల్లో ఇది రెండో సెంచరీ కాగా.. ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో రెండు సెంచరీలు సాధించిన రెండో టీమిండియా బ్యాటర్‌గా సూర్య నిలిచాడు. ఇంతకముందు రోహిత్‌ శర్మ 2018లో ఈ ఘనత సాధించాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top