Suryakumar Yadav Slips To No. 2 In Latest ICC T20 Rankings - Sakshi
Sakshi News home page

ICC T20 Rankings: టాప్‌ ర్యాంక్‌ కోల్పోయిన సూర్యకుమార్‌ యాదవ్‌

Oct 6 2022 4:10 PM | Updated on Oct 6 2022 4:32 PM

Suryakumar Yadav Slips To No. 2 In Latest ICC T20 Rankings - Sakshi

Surya Kumar Yadav: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో స్థానానికి పడిపోయాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో టాప్‌ లేపిన (అగ్రస్థానం) సూర్య.. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో విఫలం కావడంతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. గత కొంతకాలంగా టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సూర్యకుమార్‌ తన టాప్‌ ర్యాంక్‌ను ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో విధ్వంసకర హాఫ్‌ సెంచరీలతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్‌ ఆఖరి టీ20లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నిరుత్సాహపరిచాడు.

తాజా ర్యాంకింగ్స్‌లో పాక్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ తిరిగి అగ్రపీఠాన్ని అధిరోహించగా.. బాబర్‌ ఆజమ్‌ మూడులో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్‌ మార్క్రమ్‌, డేవిడ్‌ మలాన్‌ (ఇంగ్లండ్‌), ఆరోన్‌ ఫించ్‌, డెవాన్‌ కాన్వే (న్యూజిలాండ్‌), పథుమ్‌ నిస్సంక (శ్రీలంక), మహ్మద్‌ వసీం (యూఏఈ), మార్టిన్‌ గప్తిల్‌ వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో నిలిచారు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. తాజా ర్యాంకింగ్స్‌లో జోష్‌ హేజిల్‌వుడ్‌. రషీద్‌ ఖాన్‌, వనిందు హసరంగ టాప్‌-3లో కొనసాగుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement