
టి20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ తన బ్యాటింగ్ జోరును కంటిన్యూ చేస్తున్నాడు. ఎవరు విఫలమైన తాను మాత్రం తగ్గేదే లే అన్న రీతిలో బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో సూర్య కుమార్ మరోసారి ఫిప్టీతో అలరించాడు. 33 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో సరిగ్గా 50 పరుగులు చేసిన సూర్యకుమార్ కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.
అయితే బ్యాటింగ్ చేసినంతసేపు సూర్య తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. ఈ ప్రపంచకప్‌లో సూర్యకుమార్ టీమిండియాకు కచ్చితంగా పెద్ద వెన్నముక అవడం గ్యారంటీ. ఇప్పటికే ఈ ఏడాది టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో సూర్యకుమార్ తొలి స్థానంలో నిలిచాడు.
వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 59 పరుగులకే టాప్ స్కోరర్ కాగా.. సూర్యకుమార్ 50 పరుగులు చేసి ఔటైనప్పటికి తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. దినేశ్ కార్తిక్ 20 పరుగులతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్‌సన్ నాలుగు వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్, ఆస్టన్ అగర్, మిచెల్ స్టార్క్‌లు తలా ఒక వికెట్ తీశారు.
Suryakumar Yadav show, this is just incredible consistency, fifty from 32 balls. pic.twitter.com/dzsQuwSrm4
— Johns. (@CricCrazyJohns) October 17, 2022