నిరాశ పరిచిన రోహిత్‌.. మరోసారి చెలరేగిన సూర్య కుమార్‌

Suryakumar Yadav dazzles to power India to 158 6  vs Western Australia - Sakshi

IND vs WA-XI: టీ20 ప్రపంచకప్‌-2022 సన్నాహాకాల్లో భాగంగా టీమిండియా పెర్త్‌ వేదికగా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. కాగా భారత ఇన్నింగ్స్‌లో స్టార్‌ బ్యాటర్‌ సూర్య కుమార్‌ యాదవ్‌ మరో సారి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు.

కేవలం 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగులు సాధించిన సూర్య.. జట్టు 158 పరుగుల సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు హార్దిక్‌ పాండ్యా (20 బంతుల్లో 29), దినేష్‌ కార్తీక్‌(19 నాటౌట్‌) రాణించారు. ఇక టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిరాశపరిచాడు.

కేవలం 3 పరుగులు మాత్రమే చేసి రోహిత్‌ పెవిలియన్‌కు చేరాడు. ఇక ఓపెనర్‌ వచ్చిన పంత్‌ కూడా కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇక  వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రెండోర్ఫ్, మథ్యూ కెల్లీ చెరో రెండు వికెట్లు, టై ఒక్క వికెట్‌ సాధించారు. కాగా ఈ మ్యాచ్‌కు స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌కు విశ్రాంతి ఇచ్చారు.

చదవండిT20 WC Warm up Matches 2022: హాఫ్‌ సెంచరీతో చెలరేగిన కింగ్‌.. యూఏఈపై విండీస్‌ విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top