ఒకప్పుడు నెట్‌ బౌలర్‌.. ఇప్పుడు సన్‌రైజర్స్‌ జట్టులోకి ఎంట్రీ Sunrisers Hyderabad name Vijaykanth Viyaskanth as Wanindu Hasarangas replacement | Sakshi
Sakshi News home page

IPL 2024: ఒకప్పుడు నెట్‌ బౌలర్‌.. ఇప్పుడు సన్‌రైజర్స్‌ జట్టులోకి ఎంట్రీ! ఎవరంటే?

Published Tue, Apr 9 2024 6:41 PM

Sunrisers Hyderabad name Vijaykanth Viyaskanth as Wanindu Hasarangas replacement - Sakshi

ఐపీఎల్‌-2024 సీజన్‌ మొత్తానికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌, శ్రీలంక టీ20 కెప్టెన్‌ వనిందు హసరంగా గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా హసరంగా స్ధానాన్ని ఎస్‌ఆర్‌హెచ్‌ మెన్‌జ్‌మెంట్‌ భర్తీ చేసింది. అతడి స్ధానంలో మరో శ్రీలంక యువ స్పిన్నర్‌ విజయకాంత్ వియస్కాంత్‌తో సర్‌రైజర్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

రూ.50 లక్షల కనీస ధరకు ఎస్‌ఆర్‌హెచ్‌ అతడిని సొంతం చేసుకుంది. కాగా ఐపీఎల్‌-2023 సీజన్‌లో ఆర్సీబీకి నెట్‌బౌలర్‌గా విజయకాంత్ పనిచేశాడు. ఇక అతడు శ్రీలంక తరపున ఇప్పటివరకు కేవలం ఒకే టీ20 మ్యాచ్‌ ఆడాడు. కానీ విజయకాంత్‌కు అంతర్జాతీయ ‍క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేనప్పటికి.. డొమాస్టిక్‌ క్రికెట్‌లో మాత్రం మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు తన కెరీర్‌లో 33 టీ20లు ఆడిన విజయకాంత్‌ 6.76 ఏకానమీ రేటుతో 42 వికెట్లు పడగొట్టాడు.

ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులో సరైన మణికట్టు స్పిన్నర్లు లేరు. ఈ నేపథ్యంలో విజయకాంత్‌ను సొంతం చేసుకోవడం ఎస్‌ఆర్‌హెచ్‌ కలిసిశ్చే ఆంశం. కాగా ఈ ఏడాది సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఇప్పటివరకు 4మ్యాచ్‌లు ఆడి రెండింట విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్ధానంలో సన్‌రైజర్స్‌ కొనసాగుతోంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement