ప్రిక్వార్టర్స్‌లో సుమిత్‌ నగాల్‌ | Sumit Nagal in Prequarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సుమిత్‌ నగాల్‌

Feb 14 2024 3:41 AM | Updated on Feb 14 2024 3:41 AM

Sumit Nagal in Prequarters - Sakshi

భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ బెంగళూరు ఓపెన్‌ ఏటీపీ–100 చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 98వ ర్యాంకర్‌ సుమిత్‌ 6–2, 6–2తో జెఫ్రీ బ్లాంకానెక్స్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు.

88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్‌ ప్రత్యర్థి సర్వి స్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో గంటా సాయికార్తీక్‌ రెడ్డి–మనీశ్‌ సురేశ్‌కుమార్‌ (భారత్‌) జోడీ 2–6, 6–7 (8/10)తో కుజ్మయిన్‌–జా న్విర్‌ (ఫ్రాన్స్‌) జంట చేతిలో ఓడిపోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement