Star Sports Will Not Be Airing Mauka Mauka Ad For India Pakistan Asia Cup 2022 Clash - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: మౌకా.. మౌకా యాడ్‌కు మంగళం పాడిన స్టార్‌ స్పోర్ట్స్‌.. కారణం అదేనా..!

Aug 3 2022 8:03 PM | Updated on Aug 3 2022 8:34 PM

Star Sports Will Not Be Airing Mauka Mauka Ad For India Pakistan Asia Cup 2022 Clash - Sakshi

Mauka Mauka Ad: 2015 నుంచి ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ షెడ్యూలైన ప్రతిసారి మౌకా.. మౌకా అనే యాడ్‌ టీవీల్లో మార్మోగిపోయేది. అప్పటి నుంచి దాయాదుల సమరం జరిగిన ప్రతిసారి స్టార్ స్పోర్ట్స్ ఈ యాడ్‌ను ప్రసారం చేసేది. ఆసియా కప్‌-2022లో భాగంగా భారత్‌-పాక్‌ మెగా పోరుకు (ఆగస్ట్‌ 28) ముందు కూడా మౌకా.. మౌకా యాడ్‌ టీవీల్లో సందడి చేస్తుందని భారత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. 

అయితే ఈ యాడ్‌ జాడ లేకపోవడంతో వారంతా ఈ విషయంపై ఆరా తీయడం మొదలుపెట్టారు. యాడ్‌ను రూపొందించే స్టార్‌ స్పోర్ట్స్‌ యాజమాన్యాన్నే నేరుగా సంప్రదించి విషయం కనుక్కునే పనిలో పడ్డారు. తాజాగా యాడ్‌ విషయమై స్టార్‌ స్పోర్ట్స్‌ యాజమాన్యం స్పందించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి మౌకా.. మౌకా యాడ్‌ ప్రసారం ఉండదని వారు తేల్చి చెప్పినట్లు సమాచారం. త్వరలో జరుగబోయే టీ20 ప్రపంచకప్‌కు కూడా ఈ యాడ్‌ను రూపొందించే ఉద్దేశం లేనట్టు స్టార్ స్పోర్ట్స్ వర్గాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 

గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ చేతిలో టీమిండియా ఓటమి చెందడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా, మౌకా.. మౌకా యాడ్‌లో పాక్‌ అభిమాని ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ భారత్‌ను ఓడించాక బాణసంచా కాల్చి సంబురాలు చేసుకోవాలని భావిస్తుంటాడు‌. అయితే గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ వరకు ఆ పాక్‌ అభిమాని కల నెరవేరలేదు. 2021 వరల్డ్‌కప్‌లో పాక్‌ చేతిలో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. 1992 వరల్డ్‌ కప్‌ నుంచి దాయాదుల పోరు జరిగిన ప్రతిసారి టీమిండియానే విజయం వరించగా.. 2021లో మాత్రం పాక్‌ గెలుపొం‍దింది. ఈ విజయంతో యాడ్‌ యొక్క ఉద్దేశం పూర్తి అయినట్లైంది.
చదవండి: Ind Vs WI: నిరాశకు లోనయ్యాను... ఇక ముందు: సూర్యకుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement