శ్రీలంక 314/4  | Sri Lanka is heading for a huge score in the second Test | Sakshi
Sakshi News home page

శ్రీలంక 314/4 

Mar 31 2024 3:07 AM | Updated on Mar 31 2024 3:07 AM

Sri Lanka is heading for a huge score in the second Test - Sakshi

నిశాన్, కరుణరత్నే, కుశాల్‌ అర్ధ సెంచరీలు  

చట్టోగ్రామ్‌: బంగ్లాదేశ్‌తో మొదలైన రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 314 పరుగులు సాధించింది. టాపార్డర్‌ బ్యాటర్లు నిశాన్‌ మదుష్కా (57; 6 ఫోర్లు), దిముత్‌ కరుణరత్నే (86; 8 ఫోర్లు, 1 సిక్స్‌), కుశాల్‌ మెండిస్‌ (93; 11 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో రాణించారు. నిశాన్, కరుణరత్నే తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు.

నిశాన్‌ అవుటయ్యాక కుశాల్‌ మెండిస్‌తో కలిసి కరుణరత్నే రెండో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రస్తుతం దినేశ్‌ చండీమల్‌ (34 బ్యాటింగ్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెపె్టన్‌ ధనంజయ డిసిల్వా (15 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. నాలుగు నెలల తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న బంగ్లాదేశ్‌ స్టార్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ 18 ఓవర్లు వేసి 60 పరుగులిచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు.   

Advertisement
 
Advertisement
Advertisement