బంగ్లాదేశ్‌లో మాదిరి అరాచకానికి కుట్ర: రాజ్‌నాథ్‌ | Congress, allies want Bangladesh-style regime change in India, says Rajnath Singh | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో మాదిరి అరాచకానికి కుట్ర: రాజ్‌నాథ్‌

Oct 17 2026 4:47 AM | Updated on Oct 17 2026 4:47 AM

Congress, allies want Bangladesh-style regime change in India, says Rajnath Singh

లక్నో: దేశ రాజధానిలో వరుస ఆందోళనలు చేపడుతున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్రంగా మండిపడ్డారు. యువతను ఉపయోగించుకుని, అరాచకం సృష్టించి బంగ్లాదేశ్‌లో మాదిరిగా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడారు. 

రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు, అశాంతిని సృష్టించేందుకు ప్రజాస్వామ్యంలో ఎవరికీ ఎలాంటి హక్కూ లేదని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్, దాని రాజకీయ మిత్రపక్షాలు నేరుగా, తమ అనుబంధ సంస్థల ద్వారా యువ శక్తిని రాజకీయ ఘర్షణలకు, అరాచకానికి వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది’అని మంత్రి ఆరోపించారు. యువత శక్తిని నిర్మాణాత్మక పనులకు, దేశ పురోగతికి వాడుకోవడానికి బదులుగా అరాచక రాజకీయాలకు పావులుగా మారుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ తరహాలోనే మనదేశంలో కూడా ప్రభుత్వాన్ని మార్చాలని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కోరుకుంటున్నాయని సింగ్‌ ఆరోపించారు.

 ‘బంగ్లాదేశ్‌లో రెజిమ్‌ చేంజ్‌ స్ఫూర్తితోనే తాము ముందుకు వెళ్తున్నామని వారు బహిరంగంగానే చెబుతున్నారు. మరొకరేమో ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్నారు. 2024లో షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన బంగ్లాదేశ్‌ తిరుగుబాటును ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దీన్ని బట్టి వారి ఏకైక ఎజెండా ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేయడం, దేశంలో అల్లర్లు సృష్టించడమేనని స్పష్టమవుతోందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఓటరు జాబితా సర్‌కు సంబంధించిన అంశాలు, ఎన్నికల సంస్కరణలు కాకుండా ప్రభుత్వాన్ని పడగొట్టడమనేది ప్రతిపక్షాల లక్ష్యంగా మారిందని ఆయన ఆరోపించారు. 

స్వాతంత్య్రోద్యమం సమయంలో చౌరా చౌరీ హింసాత్మక ఘటన అనంతరం మహాత్మాగాంధీ ఏకంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్నే నిలిపివేశారని గుర్తు చేశారు. గాంధేయ మార్గాన్ని అనుసరిస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ నేడు.. దేశంలో ఎన్నికల ఓటమికి ప్రతీకారంగా హింస, అరాచకం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్‌ నైతిక పతనం ఏస్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని రాజ్‌నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ పేరును వాడుకునే నైతిక అర్హత ఆ పారీ్టకి ఏమాత్రం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు చెందిన గాంధీ కుటుంబం ఇంటి పేరులో గాంధీ అని వాడుకోకుండా ఆదేశించే విషయం పరిశీలించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన నిర్ణయం సుప్రీంకోర్టే తీసుకుంటుందని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement