PBKS VS SRH: ధవన్‌, రబాడలను ఊరిస్తున్న భారీ రికార్డులు

SRH VS PBKS: Players Records And Approaching Milestones - Sakshi

ఐపీఎల్ 2022 సీజన్‌ ఇవాళ (మే 22) చిట్టచివరి లీగ్‌ మ్యాచ్‌ జరుగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా సన్‌రైజర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారై, సన్‌రైజర్స్‌, పంజాబ్‌ జట్లు ఇదివరకే రేసు నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా సాగనుంది. 

రికార్డులు ఎలా ఉన్నాయంటే..
క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో పంజాబ్‌పై సన్‌రైజర్స్‌ పూర్తి ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన 19 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ 13, పంజాబ్‌ 6 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ప్రస్తుత సీజన్‌ తొలి అర్ధ భాగంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా సన్‌రైజర్స్‌ తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 7 వికెట్ల తేడాతో పంజాబ్‌ను మట్టికరిపించింది.

నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు ఇవే..
- పంజాబ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ ఈ మ్యాచ్‌లో మరో బౌండరీ సాధిస్తే ఐపీఎల్‌ చరిత్రలో 700 బౌండరీల మార్కును అందుకున్న తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే నేటి మ్యాచ్‌లో ధవన్‌  5 బౌండరీలు బాధితే పంజాబ్‌ తరఫున 50 బౌండరీలు పూర్తి చేసుకుంటాడు. 

- పంజాబ్‌ పేసర్‌ రబాడ నేటి మ్యాచ్‌లో మరో 2 వికెట్లు పడగొడితే క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 100 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఐపీఎల్‌లో 100 వికెట్లు సాధించిన తొలి సౌతాఫ్రికా బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.

- పంజాబ్‌ బౌలర్‌ రాహుల్‌ చాహర్‌ మరో 2 వికెట్లు తీస్తే టీ20ల్లో 100 వికెట్ల మార్కును చేరుకుంటాడు.

- పంజాబ్‌ హిట్టర్‌ లివింగ్‌స్టోన్‌ మరో 2 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్‌లో 4500 పరుగుల మార్కును క్రాస్‌ చేస్తాడు.

- సన్‌రైజర్స్‌ డాషింగ్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి మరో 3 బౌండరీలు బాధితే టీ20ల్లో 250 బౌండరీల మార్కును, అలాగే మరో 4 సిక్సర్లు కొడితే 100 సిక్సర్ల క్లబ్‌లో చేరతాడు.

- పంజాబ్‌ సారధి మయాంక్‌ అగర్వాల్‌ మరో 3 సిక్సర్లు బాధితే టీ20ల్లో 150 సిక్సర్ల అరుదైన క్లబ్‌లో చేరతాడు. అలాగే మయాంక్‌ నేటి మ్యాచ్‌లో మరో 6 ఫోర్లు కొడితే ఐపీఎల్‌లో పంజాబ్‌ తరఫున 150 బౌండరీలను పూర్తి చేసుకుంటాడు.

- సన్‌రైజర్స్‌ ప్లేయర్‌ నికోలస్‌ పూరన్‌ మరో 6 బౌండరీలు సాధిస్తే టీ20ల్లో 300 బౌండరీల మార్కును అందుకుంటాడు.

- సన్‌రైజర్స్‌ బౌలర్‌ శ్రేయస్‌ గోపాల్‌ మరో వికెట్‌ పడగొడితే ఐపీఎల్‌లో 50 వికెట్లను పూర్తి చేసుకుంటాడు.

- సన్‌రైజర్స్‌ హిట్టర్‌ అబ్దుల్‌ సమద్‌ మరో 4 సిక్సర్లు కొడితే టీ20ల్లో 50 సిక్సర్ల క్లబ్‌లో చేరతాడు.
చదవండి: సన్‌రైజర్స్‌తో తలపడనున్న పంజాబ్‌.. ఆరెంజ్‌ ఆర్మీ కెప్టెన్‌ ఎవరంటే..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-05-2023
May 20, 2023, 20:44 IST
ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్‌ ఆడడం దాదాపు ఖరారైనట్లే. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని...
11-06-2022
Jun 11, 2022, 17:34 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ చరిత్రలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన...
08-06-2022
Jun 08, 2022, 15:46 IST
India Vs South Africa 2022 T20 Series: టీమిండియాలో చోటు దక్కడం పట్ల కశ్మీర్‌ బౌలింగ్‌ సంచలనం ఉమ్రాన్‌...
05-06-2022
Jun 05, 2022, 08:42 IST
అర్జున్‌ టెండూల్కర్‌.. భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు. తండ్రి పేరును తనలో జోడించుకొని అతని కంటే గొప్ప...
05-06-2022
Jun 05, 2022, 07:57 IST
ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో తనకు శాపం తగిలిందని.. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఏదో కారణంగా...
04-06-2022
Jun 04, 2022, 12:11 IST
తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్‌ గిల్‌ అన్న యశ్‌ దయాల్‌
03-06-2022
Jun 03, 2022, 21:16 IST
అరంగేట్ర సీజన్‌లోనే జట్టుకు టైటిల్‌ను అందించిన గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాను ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్...
03-06-2022
Jun 03, 2022, 20:12 IST
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ గత రెండేళ్లుగా ఐపీఎల్‌ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. ఐపీఎల్‌-2021 మినీ వేలంలో...
03-06-2022
Jun 03, 2022, 19:10 IST
ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తీవ్రంగా నిరాశ పరిచింది. మరోసారి లీగ్‌ దశలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ ఇంటిముఖం పట్టింది. ఈ ఏడాది సీజన్‌లో...
03-06-2022
Jun 03, 2022, 18:19 IST
భారత జట్టు నుంచి నన్ను ఎవరూ తప్పించలేదు.. అసలు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటేనే కదా!
03-06-2022
Jun 03, 2022, 16:38 IST
IPL 2022: ఒక్క మ్యాచ్‌ ఆడలేదు.. అయినా కోటికి పైగా వెనకేశారు! టైటిల్స్‌ కూడా!
03-06-2022
Jun 03, 2022, 14:12 IST
ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాను భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్...
02-06-2022
Jun 02, 2022, 16:52 IST
నెహ్రాపై కిర్‌స్టన్‌ ప్రశంసల జల్లు
02-06-2022
Jun 02, 2022, 10:38 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌ కొందరు టీమిండియా ఆటగాళ్లకు పూర్వ వైభవం తీసుకొస్తే.. మరికొందరికి మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. యజ్వేంద్ర...
01-06-2022
Jun 01, 2022, 16:40 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌ చాంపియన్స్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని జట్టు ఏ మాత్రం...
01-06-2022
Jun 01, 2022, 11:24 IST
IPL 2022: క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ అంటే క్రికెట్‌ ప్రేమికులకు ఎక్కడా లేని ఉత్సాహం. అభిమానులు ఫోర్లు, సిక్సర్ల...
31-05-2022
May 31, 2022, 17:18 IST
ఎస్‌ఆర్‌హెచ్‌ స్టార్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రతీ బంతిని గంటకు 150...
31-05-2022
May 31, 2022, 16:36 IST
ఐపీఎల్‌‌ 15వ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా జాస్‌ బట్లర్‌ నిలిచాడు.17 మ్యాచ్‌ల్లో 863 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా...
31-05-2022
May 31, 2022, 13:05 IST
టీమిండియా స్పిన్నర్‌ కరణ్‌ శర్మకు ఐపీఎల్‌లో అత్యంత అదృష్టవంతమైన ఆటగాడిగా పేరుంది. అతడు ఏ జట్టులో ఉంటే ఆ జట్టుదే టైటిల్‌...
31-05-2022
May 31, 2022, 10:48 IST
ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఛాంపియన్స్‌గా హార్ధిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్‌ సాధించి...



 

Read also in:
Back to Top