సౌతాఫ్రికా 284 ఆలౌట్‌.. ఆసీస్‌కు కీలక ఆధిక్యం​ | South Africa all out for 284 in 1st innings, Aussies get crucial lead | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా 284 ఆలౌట్‌.. ఆసీస్‌కు కీలక ఆధిక్యం​

Oct 11 2026 8:09 PM | Updated on Oct 11 2026 8:09 PM

South Africa all out for 284 in 1st innings, Aussies get crucial lead

source: X

డర్బన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కీలక ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసిన ఆ జట్టు.. సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు కట్టడి చేసి 106 పరుగుల లీడ్‌ పొందింది. 

ఆసీస్‌ బౌలర్లు సత్తా చాటడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా హాఫ్‌ సెంచరీ చేయలేకపోయారు. 49 పరుగులు చేసిన డేవిడ్‌ బెడింగ్హమ్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. మార్క్రమ్‌ (37), స్టబ్స్‌ (32), ముల్దర్‌ (30), వెర్రిన్‌ (13), యాన్సెన్‌ (26), హార్మర్‌ (35 నాటౌట్‌), కేశవ్‌ మహారాజ్‌ (34), నోర్జే (16) రెండంకెల స్కోర్లు చేశారు. 

ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ 3 వికెట్లు తీయగా.. స్టార్క్‌, హాజిల్‌వుడ్‌, లియోన్‌ తలో 2, వెబ్‌స్టర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు మ్యాట్‌ రెన్షా (190) వీరోచిత  శతకం బాదడంతో ఆస్ట్రేలియా 390 పరుగులు చేసింది. రెన్షాకు కమిన్స్‌ (43), లియోన్‌ (27), లబూషేన్‌ (37), స్టీవ్‌ స్మిత్‌ (25) సహకరించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ముల్దర్‌ 4, యాన్సెన్‌ 3, నోర్జే 2, హార్మర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

వెలుతురు లేమి కారణంగా ముగిసిన ఆట
106 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ వికెట్‌ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. ఈ దశలో వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ 139 పరుగుల లీడ్‌లో ఉంది. మ్యాడిసన్‌ 17, హెడ్‌ 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

ఇదీ చదవండి: వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్‌ స్మిత్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement