రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. గతేడాది భారత్ అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపిన ఈ బిహారీ పిల్లాడు.. ఐపీఎల్-2026లోనూ ఆకట్టుకుంటున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా వైభవ్.. 36 బంతుల్లోనే శతక్కొట్టాడు.
బ్యాట్‌తోనే సమాధానం
తద్వారా ఐపీఎల్‌లో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. గతేడాది గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే వైభవ్ శతకం సాధించిన విషయం తెలిసిందే. అయితే, సన్‌రైజర్స్‌పై కొట్టిన సెంచరీ తనకు అత్యంత ప్రత్యేకం అంటున్నాడు వైభవ్ సూర్యవంశీ.
తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నచ్చదని.. అందుకే బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చానని తెలిపాడు. పరోక్షంగా సన్‌రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగేకు వైభవ్ కౌంటర్ వేశాడు.
నన్ను వ్యక్తిగతంగా అంటే నచ్చదు
సన్‌రైజర్స్‌తో మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ తమ మేనేజర్ రోమీ భిందర్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆ బౌలర్ (హింగే)ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన వ్యూహంతోనే బ్యాటింగ్‌కు దిగాను. గత మ్యాచ్‌లో నన్ను అతడు అవుట్ చేశాడు.
ఆరోజు నేను నా ఫోన్ చెక్ చేశా. నా గురించి ఎవరు ఏమన్నారో చూశాను. సాధారణంగా నేను ఇలాంటి విషయాలు పట్టించుకోను. అయితే, ఎవరైనా నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే.. అది నాపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది’’ అని పేర్కొన్నాడు. తనను టార్గెట్ చేసిన ప్రఫుల్ హింగే బౌలింగ్‌లోనే విశ్వరూపం ప్రదర్శించడం పట్ల పదిహేనేళ్ల వైభవ్ ఈ మేరకు స్పందించాడు.
గత మ్యాచ్‌లో తొలి బంతికే
కాగా సన్‌రైజర్స్‌తో ఆడిన గత మ్యాచ్‌లో ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో తొలి బంతికే అవుటైన వైభవ్ సూర్యవంశీ... ఈ సారి తొలి ఓవర్‌లోనే విశ్వరూపం కనబర్చాడు. నాలుగు సిక్స్‌లతో హింగేకు స్వాగతం పలికిన వైభవ్... కమిన్స్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికి సైతం భారీ సిక్స్ కొట్టాడు.
మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10) త్వరగా అవుట్ కాగా... వైభవ్ ఇచ్చిన క్యాచ్‌ను రైజర్స్ ఫీల్డర్ అనికేత్ వదిలేశాడు. ఇదే జోరులో మరో రెండు సిక్స్‌లు బాదిన సూర్యవంశీ 15 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
వైభవ్‌పై హింగే కామెంట్స్
సకీబ్ ఓవర్‌లో వరుసగా 6, 4, 6తో వైభవ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. జైపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా వైభవ్ సెంచరీ వృథా అయింది.
కాగా హైదరాబాద్‌లో వైభవ్‌ను అవుట్ చేసిన తర్వాత ప్రఫుల్ హింగే మాట్లాడుతూ.. ‘‘అతడికి (వైభవ్) బౌన్సర్ వేసి అవుట్ చేస్తానని మా వాళ్లకు ముందే చెప్పాను. అతడిని అవుట్ చేయాలన్నదే నా లక్ష్యం’’ అని పేర్కొన్నాడు.
ఇందుకు బదులుగా జైపూర్‌లో వైభవ్ హింగేపై ప్రతీకారం తీర్చుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో.. ‘‘పిల్లాడే గానీ... మనసులో ఇంత పెట్టుకున్నాడా? వీడు మామూలోడు కాదు’’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్‌లో లేకున్నా అందుకే అతడిని పంపించాం
A first-ball duck a few days ago to the fastest century by an Indian last night.
Vaibhav Sooryavanshi just refuses to give up 👏💗 pic.twitter.com/IqDaWvkAu9— Rajasthan Royals (@rajasthanroyals) April 26, 2026


