ఓర్నీ.. క్రికెట్ గ్రౌండ్‌లో నీకేమి పని? ఫోటో వైర‌ల్‌ | Snake Charmer Enjoys Sri Lanka-Bangladesh Test With 2 Snakes | Sakshi
Sakshi News home page

SL vs BAN: ఓర్నీ.. క్రికెట్ గ్రౌండ్‌లో నీకేమి పని? ఫోటో వైర‌ల్‌

Jun 21 2025 7:59 PM | Updated on Jun 21 2025 8:13 PM

Snake Charmer Enjoys Sri Lanka-Bangladesh Test With 2 Snakes

గాలే వేదిక‌గా శ్రీలంక‌-బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రిగిన తొలి టెస్టు సంద‌ర్భంగా ఓ విచిత్ర‌క‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది.  ఐదో రోజు ఆట‌లో పాములు పట్టే వ్య‌క్తి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. స్నేక్ క్యాచ‌ర్ రెండు పాముల‌ను తీసుకొచ్చి ప్ర‌శాంతంగా నేలపై కూర్చుని మ్యాచ్‌ను వీక్షించాడు. అత‌డి వ‌ద్ద పాముల‌తో పాటు ఓ కోతి కూడా ఉంది. ఇది చూసిన మిగితా ప్రేక్ష‌కులు ఆశ్చర్య‌పోయారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

తొలి టెస్టు డ్రా.. 
ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. బంగ్లా, శ్రీలంక మ‌ధ్య జ‌రిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో ప‌ర్యాట‌క బంగ్లాదేశ్ జ‌ట్టు 495 ప‌రుగుల‌ భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ న‌జ్ముల్ హుస్సేన్ షాంటో(148), ముష్ఫికర్ ర‌హీం(163) అద్బుత‌మైన సెంచ‌రీల‌తో చెల‌రేగ‌గా..  లిట్టన్ దాస్ 90 పరుగులతో రాణించాడు.

అనంత‌రం శ్రీలంక కూడా బంగ్లాకు ధీటుగా బ‌దులిచ్చింది. శ్రీలంక త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 485 ప‌రుగుల భారీ చేసింది. లంక బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ పాథుమ్ నిస్సాంక‌(187) భారీ శ‌తకం సాధించ‌గా.. చండీమ‌ల్‌(54), కుమిందు మెండిస్‌(87) రాణించారు. అనంత‌రం బంగ్లా జ‌ట్టు త‌మ రెండో ఇన్నింగ్స్‌ను 285-6 వ‌ద్ద డిక్లేర్ చేసింది.

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ల‌భించిన ఆధిక్యాన్ని జోడించి ప్ర‌త్య‌ర్ధి ముందు 296 ప‌రుగుల ల‌క్ష్యాన్ని బంగ్లా జ‌ట్టు ఉంచింది. ఆఖ‌రి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 72 ప‌రుగులు చేసింది. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.



 

 

Advertisement
 
Advertisement
Advertisement