గుకేశ్‌ ఖాతాలో ఏడో ‘డ్రా’ | Sinquefield Cup R7: Caruana Misses Against Gukesh, Check Out The Details Inside | Sakshi
Sakshi News home page

గుకేశ్‌ ఖాతాలో ఏడో ‘డ్రా’

Aug 28 2024 11:22 AM | Updated on Aug 28 2024 12:18 PM

Sinquefield Cup R7: Caruana Misses Against Gukesh

సెయింట్‌ లూయిస్‌: సింక్‌ఫీల్డ్‌ కప్‌ అంతర్జాతీయ క్లాసికల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్‌, ప్రజ్ఞానంద వరుసగా ఏడో ‘డ్రా’ నమోదు చేశారు. టాప్‌ సీడ్‌, ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన గేమ్‌ను గుకేశ్‌ 60 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఇయాన్‌ నిపోమ్‌నిషి (రష్యా)తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 19 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. 

పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్‌) ఐదు పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలో ఉన్నాడు. నాలుగు పాయింట్లతో కరువానా రెండో స్థానంలో నిలిచాడు. 3.5 పాయింట్లతో గుకేశ్‌, మాక్సిమి లాచెర్‌ (ఫ్రాన్స్‌), నొదిర్‌బెక్‌ అబ్దుసత్తరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌), వెస్లీ సో (అమెరికా), ప్రజ్ఞానంద సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement