ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ విజేత మైటీ మరాఠాస్‌ | Mighty Marathas beat Kakatiya Knights in Archery Premier League Season 2 | Sakshi
Sakshi News home page

ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ విజేత మైటీ మరాఠాస్‌

Oct 19 2026 5:38 AM | Updated on Oct 19 2026 5:38 AM

Mighty Marathas beat Kakatiya Knights in Archery Premier League Season 2

సాక్షి, హైదరాబాద్‌: గురి తప్పని లక్ష్యంతో నిలకడగా పాయింట్లు సాధించిన మైటీ మరాఠాస్‌ జట్టు ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) రెండో సీజన్‌లో చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం రాత్రి నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో జరిగిన ఫైనల్లో మైటీ మరాఠాస్‌ జట్టు 6–2 సెట్‌ (75–75, 77–76, 75–75, 79–73) పాయింట్ల తేడాతో కాకతీయ నైట్స్‌ జట్టును ఓడించి టైటిల్‌ సొంతం చేసుకుంది. మరాఠాస్‌ జట్టుకు టైటిల్‌ దక్కడంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధీరజ్‌ బొమ్మదేవర కీలకపాత్ర పోషించాడు. ఫైనల్లో ధీరజ్‌ 80 పాయింట్లకుగాను 79 పాయింట్లు స్కోరు చేశాడు. 

ధీరజ్‌తోపాటు మరాఠాస్‌ జట్టులో మైక్‌ ష్కాలెసర్, అలెజాంద్రా వలెన్సియా, పర్ణీత్‌ కౌర్, సిమ్రన్‌జీత్‌ కౌర్, అమన్‌ సైనీ, మృణాల్‌ చౌహాన్, మధుర సభ్యులుగా ఉన్నారు. రన్నరప్‌ కాకతీయ నైట్స్‌ జట్టులో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ, నికో వీనెర్, ఇలియా కెనాలెస్, నీరజ్‌ చౌహాన్, రోహిత్‌ కుమార్, అవనీత్‌ కౌర్, శివశంకర్, రిధి సభ్యులుగా ఉన్నారు. రికర్వ్‌ విభాగంలో ధీరజ్‌ బొమ్మదేవర (మరాఠాస్‌), సంగీత (రాజ్‌పుతానా రాయల్స్‌)... కాంపౌండ్‌ విభాగంలో మథియాస్‌ ఫులెర్టన్‌ (చేరో ఆర్చర్స్‌), అలెజాంద్రా ఉస్కియానో (చోళా చీఫ్స్‌) ‘బెస్ట్‌ ఆర్చర్స్‌’ అవార్డులు దక్కించుకున్నారు. మొత్తం ఆరు జట్లు ఈ లీగ్‌లో పాల్గొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement