Asian Para Games: భారత్‌ ఖాతాలో 15వ స్వర్ణం | Asian Para Games 2026 Day 4, Suvarna Raj Wins Gold As India Medal Tally Reaches 15 Golds, Eyes 100 Medal Milestone | Sakshi
Sakshi News home page

Asian Para Games: భారత్‌ ఖాతాలో 15వ స్వర్ణం

Oct 22 2026 8:12 AM | Updated on Oct 22 2026 8:54 AM

Asian Para Games 2026 Day 4: Suvarna Raj Clinches Top Podium Spot To Earn India 15th Gold Medal

source: X

ఆసియా పారా గేమ్స్‌ 2026లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. నాలుగో రోజు మహిళల డిస్కస్‌ త్రో F54 విభాగంలో సువర్ణ రాజ్‌ స్వర్ణ పతకం సాధించింది. దీంతో భారత్‌ ఖాతాలో 15వ స్వర్ణం చేరింది.

పారా ఆర్చరీ మహిళల W1 విభాగంలో స్వాతి చౌదరి రజత పతకం గెలుచుకుంది. ఫైనల్లో స్వాతి చైనాకు చెందిన సెన్‌ మెంగ్‌కాన్‌ చేతిలో 4-6తో ఓడిపోయింది.

మరోవైపు స్టార్‌ ఆర్చర్‌ శీతల్‌ దేవిపై భారత్‌ భారీ ఆశలు పెట్టుకుంది. మహిళల కాంపౌండ్‌ విభాగం స్వర్ణ పతక పోరులో ఆమె సింగపూర్‌కు చెందిన నూర్‌ అలిమ్‌తో తలపడనుంది. అథ్లెటిక్స్‌లో హైజంప్‌, మహిళల 400 మీటర్లు, జావెలిన్‌ త్రో, లాంగ్‌జంప్‌ విభాగాల్లోనూ భారత అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు.

మూడో రోజు ముగిసే సమయానికి భారత్‌ ఖాతాలో 62 పతకాలు ఉన్నాయి. 100 పతకాల మైలురాయికి చేరువ కావడమే లక్ష్యంగా భారత బృందం ముందుకు సాగుతోంది.

ఇదీ చదవండి: ‘పారా’ ఆటగాళ్ల పతక వర్షం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement