జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్‌లో భారత పారా అథ్లెట్ల అద్భుత పోరాటం ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత్ మొత్తం 114 పతకాలు సాధించింది. ఇందులో 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో నాలుగో స్ధానంలో ఉంది.
ఈ సంచలన ప్రదర్శనతో భారత్ తన గత ఎడిషన్ పతకాల రికార్డును అధిగమించింది. చైనా వేదికగా జరిగిన 2022 పారా ఆసియా క్రీడల్లో మొదట 111 పతకాలు గెలిచింది. అయితే నీరజ్ యాదవ్, పర్వీన్‌ల డోపింగ్ ఆరోపణల కారణంగా మూడు పతకాలను ఉపసంహరించుకోవడంతో పతకాల సంఖ్య 108 చేరింది. కానీ ఈసారి మాత్రం భారత్ గత రికార్డులన్నింటినీ అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
గత హాంగ్‌జౌ ఎడిషన్‌లో 309 మంది అథ్లెట్లు పాల్గొనగా.. ఈసారి భారత్ తరపున కేవలం 168 మంది పారా అథ్లెట్లను మాత్రమే బరిలోకి దంపారు. తక్కువ సంఖ్యలో పాల్గొన్నప్పటికీ, అద్భుతమైన పట్టుదలతో చరిత్రను తిరగరాశారు.
చదవండి: వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. హ్యారీ బ్రూక్ చెత్త రికార్డు!


