ఆసియా పారా క్రీడలు షురూ | Asian Para Games begin in Japan | Sakshi
Sakshi News home page

ఆసియా పారా క్రీడలు షురూ

Oct 19 2026 5:42 AM | Updated on Oct 19 2026 5:42 AM

Asian Para Games begin in Japan

నగోయా (జపాన్‌): ఆసియా పారా క్రీడలు ఆదివారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. పారాలింపిక్‌ పతక విజేత సిమ్రన్‌ శర్మ, ప్రముఖ షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ త్రివర్ణ పతాకధారులుగా ముందు నడవగా... వారి వెంట భారత పారా అథ్లెట్ల బృందం ఆరంభ వేడుకల్లో పాల్గొంది. మన అథ్లెట్లు భారత ఘన వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక దుస్తువుల్లో మెరిశారు. ఈ క్రీడల్లో భారత్‌ నుంచి 168 మంది అథ్లెట్లు 11 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు. 

ఇందులో 112 మంది పురుషులు, 56 మంది మహిళలు ఉన్నారు. 2023లో హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా పారా క్రీడల్లో భారతదేశం అద్వితీయ ప్రదర్శన కనబర్చింది. రికార్డు స్థాయిలో 111 పతకాలు (29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలు) సాధించి పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఇప్పుడు దానికన్నా మెరుగైన ప్రదర్శన కనబర్చాలనే లక్ష్యంతో జపాన్‌ క్రీడలకు సిద్ధమైంది. నేటి నుంచి మెడల్‌ ఈవెంట్స్‌ ప్రారంభం కానుండగా... 24న ఈ క్రీడలు ముగియనున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement