సింగపూర్‌ గ్రాండ్‌ప్రి విజేత కార్లోస్‌ సెయింజ్‌ | Sakshi
Sakshi News home page

సింగపూర్‌ గ్రాండ్‌ప్రి విజేత కార్లోస్‌ సెయింజ్‌

Published Mon, Sep 18 2023 2:55 AM

Singapore Grand Prix winner Carlos Sainz - Sakshi

సింగపూర్‌: ఫార్ములావన్‌ 2023 సీజన్‌లో ఎట్టకేలకు 15వ రేసులో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్లు కాకుండా మరో జట్టుకు చెందిన డ్రైవర్‌ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన సింగపూర్‌ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్‌ కార్లోస్‌ సెయింజ్‌ చాంపియన్‌ అయ్యాడు. నిర్ణీత 62 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్‌ పొజిషన్‌’తో ప్రారంభించిన సెయింజ్‌ అందరికంటే వేగంగా గంటా 46 నిమిషాల 37.418 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు.

22 రేసుల ఈ సీజన్‌లో తొలి 14 రేసుల్లో రెడ్‌బుల్‌ డ్రైవర్లు వెర్‌స్టాపెన్‌ (12), సెర్జియో పెరెజ్‌ (2) విజేతగా నిలిచారు. అయితే సింగపూర్‌ గ్రాండ్‌ప్రిలో వీరిద్దరికి నిరాశ ఎదురైంది. వెర్‌స్టాపెన్‌ ఐదో స్థానంతో, పెరెజ్‌ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌) రెండో స్థానంలో, లూయిస్‌ హామిల్టన్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది.   

Advertisement
 
Advertisement