‘అతడు ఓపెనింగ్ కాదు మూడో స్థానంలో వస్తాడు’ | Shreyas Iyer Reveals-Where-Vaibhav-Sooryavanshi-Will-Bat-2nd T20I Vs NZ | Sakshi
Sakshi News home page

‘అతడు ఓపెనింగ్ కాదు మూడో స్థానంలో వస్తాడు’

Oct 24 2026 1:53 PM | Updated on Oct 24 2026 1:59 PM

Shreyas Iyer Reveals-Where-Vaibhav-Sooryavanshi-Will-Bat-2nd T20I Vs NZ

Photo Credit: Twitter

క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే టాస్ సమయంలో శ్రేయస్ అయ్యర్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ వచ్చే స్థానంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌లో వైభవ్ ఓపెనర్‌గా రాడని, ఇషాన్ కిషన్ స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు వన్‌డౌన్‌లోనే బ్యాటింగ్ చేస్తాడని తెలిపాడు. 

అభిషేక్‌, సంజూ సామ్సన్‌లతో ఓపెనింగ్ జోడీ సక్సెస్ అయిందని పేర్కొన్నాడు. దీంతో వీళ్ల కాంబినేషన్ విడదీయడం జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇష్టం లేదని, అందుకే వైభవ్ వన్‌డౌన్‌లోనే బ్యాటింగ్‌కు వస్తాడని అయ్యర్ చెప్పుకొచ్చాడు.

అయ్యర్‌ ఇంకా మాట్లాడుతూ..‘ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడానికి రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు కురవడం ఒక కారణం. తొలి టీ20 తర్వాత మాకు నిద్రపోవడానికి మాకు సమయం దొరికింది. అందరూ మంచి ఫిట్‌నెస్‌లో ఉన్నారని నేను చెప్పగలను. నాతో సహా కొంతమంది ఆటగాళ్లు మ్యాచ్ రోజున కూడా శిక్షణ తీసుకుంటారు. 

కాబట్టి, మేము మంచి స్థితిలో ఉన్నాము. దూకుడును కొనసాగిస్తాం. మొదటి మ్యాచ్ సాధించిన విజయాన్ని ఇక్కడా పునరావృతం చేయాలని భావిస్తున్నాం. అయితే మేము ఫీల్డింగ్‌లో మరింత చురుకుగా ఉండాలి. ముఖ్యంగా చివరి ఓవర్‌లో సర్కిల్ లోపల అదనపు ఫీల్డర్ లేకుండా చూసుకోవాలి.’ అని తెలిపాడు.

ఇక మ్యాచ్‌లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండడంతో కివీస్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతోంది. 15 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (47), బెవన్ జాకబ్స్ (35) క్రీజులో ఉన్నారు. ప్రిన్స్ యాదవ్‌, అర్షదీప్‌, భువనేశ్వర్‌లు తలా ఒక వికెట్ తీశారు.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement