1434 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన భువీ | Bhuvneshwar Kumar Pick Up A T20I Wicket For India After 1434 Days | Sakshi
Sakshi News home page

1434 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన భువీ

Oct 24 2026 1:55 PM | Updated on Oct 24 2026 1:55 PM

Bhuvneshwar Kumar Pick Up A T20I Wicket For India After 1434 Days

source: X

టీమిండియా వెటరన్‌ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల విరామం తర్వాత ఇటీవలే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆడిన తొలి మ్యాచ్‌లో (వెస్టిండీస్‌తో ఐదో టీ20) అతడికి బౌలింగ్‌ అవకాశం రాలేదు. ఆ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది.

తాజాగా న్యూజిలాండ్‌తో తొలి టీ20లో భువీకి బౌలింగ్‌ అవకాశం​ వచ్చినా దారుణంగా విఫలమయ్యాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ జరుగుతున్న రెండో టీ20లో భువీ ఎట్టకేలకే తన రీఎంట్రీ వికెట్‌ తీశాడు. తద్వారా 1434 రోజుల తర్వాత అంతర్జాతీయ టీ20 వికెట్‌ తీసి, సుదీర్ఘ వికెట్‌ నిరీక్షణకు తెరదించాడు.  

ఈ మ్యాచ్‌లో భువీ అద్భుతమైన గుడ్‌ లెంగ్త్‌ బంతితో డారిల్ మిచెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇదే భువీకి రీఎంట్రీ వికెట్‌. అతడు చివరిసారిగా 2022 నవంబర్ 20న న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో అంతర్జాతీయ వికెట్ సాధించాడు. ఆ మ్యాచ్‌లో ఫిన్ అలెన్‌ను ఔట్ చేశాడు. అప్పటి నుంచి వికెట్ కోసం ఎదురుచూసిన భువీ ఎట్టకేలకు మళ్లీ న్యూజిలాండ్‌లోనే వికెట్‌ సాధించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌ న్యూజిలాండ్‌ను ఒత్తిడిలో ఉంచింది. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు డిఫెన్స్‌ గేమ్‌ అడుతుంది. భువీ డారిల్‌ మిచెల్‌ (6)ను, అర్షదీప్‌ సింగ్‌ టిమ్‌ సీఫర్ట్‌ (7), ప్రిన్స్‌ యాదవ్‌ ఫిన్‌ అలెన్‌ (16)ను ఔట్‌ చేయగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (60 నాటౌట్‌), బెవాన్‌ జాకబ్స్‌ (50 నాటౌట్‌) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో ఇన్నింగ్స్‌ను నిర్మించారు. 17 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 145-3గా ఉంది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ గెలిచి భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.  

ఇదీ చదవండి: రీఎంట్రీపై తొలిసారి పెద‌వి విప్పిన భువ‌నేశ్వ‌ర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement