మూడో టీ20కి కూడా ఇషాన్‌ దూరం..? వైభవ్‌కి సువర్ణావకాశం | Ishan Kishan Ruled Out Of India vs New Zealand 3rd T20I says Report | Sakshi
Sakshi News home page

మూడో టీ20కి కూడా ఇషాన్‌ దూరం..? వైభవ్‌కి సువర్ణావకాశం

Oct 24 2026 12:56 PM | Updated on Oct 24 2026 1:08 PM

Ishan Kishan Ruled Out Of India vs New Zealand 3rd T20I says Report

source: X

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. గాయం కారణంగా రెండో టీ20కి దూరమైన వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. మూడో మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం లేదని నివేదికలు వెల్లడించాయి. అయితే దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తొలి టీ20లో ఇషాన్ కుడి తొడ కండరానికి స్వల్ప గాయమైంది. దీంతో రెండో మ్యాచ్‌కు అతడిని దూరంగా ఉంచారు. గాయం తీవ్రతను బట్టి మిగిలిన సిరీస్‌కు కూడా అతడు దూరమయ్యే అవకాశముంది.

ఇషాన్ స్థానంలో కుషాగ్రా
ఇషాన్ కిషన్‌కు ప్రత్యామ్నాయంగా జార్ఖండ్‌కు చెందిన వికెట్‌కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్రాను రెండో టీ20 కోసం జట్టులోకి తీసుకున్నారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే అతడిని మిగిలిన మ్యాచ్‌లకు కూడా కొనసాగించే అవకాశం ఉంది.

వైభవ్ సూర్యవంశీకి సువర్ణావకాశం
ఇషాన్ కిషన్ గైర్హాజరీ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి రెండో టీ20లో అవకాశం కల్పించారు. 15 ఏళ్ల ఈ యువ సంచలనం వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. తాజాగా ఇషాన్ రూపంలో వైభవ్‌కు సువర్ణావకాశం లభించింది. ఈ అవకాశాన్ని అతడు ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

కాగా, క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఇవాళ రెండో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. భారత బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌ (1-15), అర్షదీప్‌ సింగ్‌ (1-8) ఆదిలోనే చెలరేగిపోయారు.ఫలితంగా న్యూజిలాండ్‌ 4 ఓవర్లలో 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఫిన్‌ అలెన్‌ (6), గ్లెన్‌ ఫిలిప్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌లో గెలిచి 1-0 ఆధిక్యంలో ​కొనసాగుతోంది. 
 

ఇదీ చదవండి: టాస్‌ గెలిచిన టీమిండియా.. వైభవ్‌తో పాటు అతడికి చోటు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement