టాస్‌ గెలిచిన టీమిండియా.. వైభవ్‌తో పాటు అతడికి చోటు | India Won Toss-Choose Bowl-Vaibhav-Prince Yadav-Replaced-2nd T20 Vs NZ | Sakshi
Sakshi News home page

టాస్‌ గెలిచిన టీమిండియా.. వైభవ్‌తో పాటు అతడికి చోటు

Oct 24 2026 12:08 PM | Updated on Oct 24 2026 12:26 PM

India Won Toss-Choose Bowl-Vaibhav-Prince Yadav-Replaced-2nd T20 Vs NZ

Photo Credit: BCCI Twitter

న్యూజిలాండ్‌తో జ‌రిగిన‌ తొలి టీ20లో 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన టీమిండియా రెట్టింపు ఉత్సాహంతో రెండో టీ20కి సిద్ధ‌మ‌య్యింది. ప‌రుగుల వ‌ర‌ద పారిన క్రైస్ట్‌చ‌ర్చి వేదిక‌లోనే రెండో టీ20 జ‌ర‌గ‌నుండ‌డంతో ఈసారి కూడా బ్యాట‌ర్లు ప‌రుగులు పండుగ చేసుకునే అవ‌కాశ‌ముంది.  

టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. గ‌జ్జ‌ల్లో గాయం కార‌ణంగా ఇషాన్ కిష‌న్ రెండో టీ20కి దూరమ‌వ్వ‌గా, అత‌డి స్థానంలో వైభ‌వ్ సూర్య‌వంశీ తుదిజ‌ట్టులోకి రాగా.. మయాంక్‌ యాదవ్‌ స్థానంలో ప్రిన్స్‌ యాదవ్‌ను తీసుకున్నట్లు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు.

మ‌రోవైపు తొలి టీ20లో బౌలింగ్ వైఫ‌ల్యంతో ఓట‌మి చ‌విచూసిన న్యూజిలాండ్ రెండో టీ20లో గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని భావిస్తోంది.  మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఒక మార్పుతో బ‌రిలోకి దిగింది. ఆడ‌మ్ మిల్నే స్థానంలో జాక‌బ్ డ‌ఫీ తుదిజ‌ట్టులోకి వ‌చ్చాడు.

టీమిండియా: సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్‌ యాదవ్

న్యూజిలాండ్‌: టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement