న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టీమిండియాలోకి కుమార్ కుషాగ్రా | KUMAR KUSHAGRA ADDED TO INDIAN T20I TEAM AS COVER UP FOR ISHAN KISHAN | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టీమిండియాలోకి కుమార్ కుషాగ్రా

Oct 24 2026 11:06 AM | Updated on Oct 24 2026 11:06 AM

KUMAR KUSHAGRA ADDED TO INDIAN T20I TEAM AS COVER UP FOR ISHAN KISHAN

source: X

న్యూజిలాండ్‌తో రెండో టీ20కి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. తొలి టీ20లో గాయపడిన వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో వికెట్‌కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్రాను కవర్‌ అప్‌గా ఎంపిక చేశారు. ప్రస్తుతం క్రైస్ట్‌చర్చ్‌లో భారత్-ఏ జట్టుతో ఉన్న కుషాగ్రా రెండో టీ20 కోసం టీమిండియాతో చేరనున్నాడు.

ఇషాన్ దూరం కావడంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో అతడికి ఆడే అవకాశం రాలేదు. కుషాగ్రా ఇషాన్‌కు కవర్‌ అప్‌గా ఎంపికైనా తుది జట్టులో ఆడే అవకాశం రాకపోవచ్చు.

రెండో టీ20కి భారత జట్టు
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్‌కీపర్), వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, కుమార్ కుషాగ్రా (వికెట్‌కీపర్).

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌లో 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సంజూ శాంసన్ 33 బంతుల్లో 67 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చివర్లో నమన్‌ ధిర్‌ మెరుపులు కూడా భారత విజయంలో కీలకపాత్ర పోషించాయి. 

ఇదీ చదవండి: భార‌త ఆట‌గాళ్లకు ఊహించ‌ని స‌మ‌స్య‌.. క్ష‌ణాల్లో ప‌రిష్కారం!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement