IND vs NZ: మూడో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌ | IND vs NZ 2nd T20I: Toss Playing XI, Updates And Result | Sakshi
Sakshi News home page

IND vs NZ: మూడో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌

Oct 24 2026 12:39 PM | Updated on Oct 24 2026 1:18 PM

IND vs NZ 2nd T20I: Toss Playing XI, Updates And Result

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌- టీమిండియా మధ్య శనివారం నాటి రెండో టీ20 మొదలైంది. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. కివీస్‌ జట్టు బ్యాటింగ్‌కు దిగింది.

UPDATES
పది ఓవర్లలో న్యూజిలాండ్‌ స్కోరు: 66-3
జేకబ్స్‌ 19, గ్లెన్‌ ఫిలిప్స్‌ 15 పరుగులతో ఉన్నారు.

పవర్‌ ప్లేలో న్యూజిలాండ్‌ స్కోరు: 43-3 (6)
జేకబ్‌ ఒక పరుగు, గ్లెన్‌ ఫిలిప్స్‌ 10 పరుగులతో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన కివీస్‌
5.2వ ఓవర్‌: ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఫిన్‌ అలెన్‌ బౌల్డ్‌ (16). స్కోరు: 41-3. గ్లెన్‌ ఫిలిప్స్‌ 9 పరుగులతో ఉన్నాడు. బేవన్‌ జేకబ్స్‌ క్రీజులోకి వచ్చాడు.

రెండో వికెట్‌ డౌన్‌
2.6వ ఓవర్‌: భువీ బౌలింగ్‌లో తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన డారిల్‌ మిచెల్‌ (6). గ్లెన్‌ ఫిలిప్స్‌ క్రీజులోకి రాగా.. అలెన్‌ 5 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 18-2 (3).

తొలి వికెట్‌ డౌన్‌
1.3వ ఓవర్‌: అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన టిమ్‌ సీఫర్ట్‌ (7). డారిల్‌ మిచెల్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 11-1 (2). అలెన్‌ 3, మిచెల్‌ ఒక పరుగుతో ఉన్నారు. 

వైభవ్‌ వచ్చేశాడు
కివీస్‌తో రెండో టీ20లో భారత తుదిజట్టులో రెండు మార్పులు జరిగాయి. గ‌జ్జ‌ల్లో గాయం కార‌ణంగా ఇషాన్ కిష‌న్ దూరమ‌వ్వ‌గా, అత‌డి స్థానంలో వైభ‌వ్ సూర్య‌వంశీ తుదిజ‌ట్టులోకి వచ్చాడు. మయాంక్‌ యాదవ్‌ స్థానంలో ప్రిన్స్‌ యాదవ్‌ వచ్చాడు.

తుదిజట్లు
భారత్‌
సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్‌ యాదవ్

న్యూజిలాండ్‌
టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement