Shivam Dube Hit Such a 94 Meter Long Six During CSK vs LSG IPL 2022 Match
Sakshi News home page

Shivam Dube 94 Metre Six Video: భారీ సిక్సర్‌ బాదిన సీఎస్కే బ్యాటర్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే!

Apr 1 2022 10:32 AM | Updated on Apr 1 2022 1:08 PM

Shivam Dube hits a mammoth 94 metre six during CSK vs LSG match - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్‌ శివమ్‌ దుబే అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 30 బంతుల్లో 49 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు సిక్స్‌లు, 5 ఫోర్లు ఉన్నాయి. కాగా  సీఎస్కే ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన దుష్మంత చమీరా బౌలింగ్‌లో.. దుబే 94 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే తరువాత ఓవర్‌ వేసిన అవేష్‌ ఖాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన దుబే.. లూయిస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. చెన్నై సూపర్‌కింగ్స్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌ జెయింట్స్‌ 4 వికెట్ల కోల్పోయి సునయాసంగా చేధించింది. లక్నో బ్యాటర్లలో డికాక్‌ (61) కేఎల్‌ రాహుల్‌ (40) లూయిస్‌(55) పరుగులతో చెలరేగారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో ఊతప్ప 50, శివమ్‌ దూబే 49, మొయిన్‌ అలీ 35 పరుగులతో రాణించారు.

చదవండి: IPL 2022 CSK VS LSG: సీఎస్‌కేపై ఘన విజయం.. లక్నో ఖాతాలో అరుదైన రికార్డు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement