IPL 2023: అతడిని కొనేంత డబ్బు లేదు! నేనేమీ బాధపడటం లేదు! ఇండియాలో.. | Shanaka Reacts To Gambhir Wont Have Money For Him Comment Unsold in IPL | Sakshi
Sakshi News home page

Dasun Shanaka: అతడిని కొనేంత డబ్బు లేదు! నేనేమీ బాధపడటం లేదు! ఇండియాలో..

Published Fri, Feb 10 2023 12:23 PM | Last Updated on Fri, Feb 10 2023 12:47 PM

Shanaka Reacts To Gambhir Wont Have Money For Him Comment Unsold in IPL - Sakshi

Dasun Shanaka- Gautam Gambhir: ‘‘నా దగ్గర తనను కొనుగోలు చేసేంత డబ్బు లేదు. తన బ్యాటింగ్‌ అద్భుతం. ఒకవేళ ఐపీఎల్‌ వేలానికి ముందు ఈ సిరీస్‌ జరిగి ఉంటే అతడు.. ఎంతటి భారీ ధరకు అమ్ముడుపోయేవాడో!

నా అభిప్రాయం ప్రకారం ఏ ఒక్క ఫ్రాంఛైజీ దగ్గర అతడిని కొనుగోలు చేసేంత డబ్బు ఉండేది కాదు’’.. శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ షనకను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ మెంటార్‌ గౌతం గంభీర్‌ చేసిన వ్యాఖ్యలు ఇవి. 

టీమిండియాతో భారత గడ్డపై జరిగిన టీ20 సిరీస్‌లో షనక అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఆసియా టీ20 కప్‌ టీ20 టోర్నీలో లంకను విజేతగా నిలిపిన అతడు.. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌తో సిరీస్‌లోనూ అదరగొట్టాడు.

అదరగొట్టాడు
తొలి టీ20 లో 27 బంతుల్లో 45, రెండో మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంతేగాక.. మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేలా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన అక్షర్‌ పటేల్‌ను అవుట్‌ చేసి రెండో టీ20లో జట్టుకు విజయం అందించాడు. ఇక మూడో మ్యాచ్‌లో 23 పరుగులకే పరిమితమయ్యాడు. ఏదైమైనా సిరీస్‌ ఓడినప్పటికీ ఆటగాడిగా మాత్రం షనక సఫలమయ్యాడని చెప్పొచ్చు.

అయినా పాపం!
ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్‌లో మెరుగ్గా రాణిస్తున్న షనక.. ఐపీఎల్‌-2023 మినీ వేలంలో తన పేరు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. రూ. 50 లక్షల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చిన అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. ఈ నేపథ్యంలో టీమిండియాతో సిరీస్‌లో అతడి ప్రదర్శన సందర్భంగా గంభీర్‌ ఈ మేరకు ప్రశంసలు కురిపించాడు.

నేనేం బాధపడటం లేదు
ఈ వ్యాఖ్యలపై దసున్‌ షనక తాజాగా స్పందించాడు. హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇండియా పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయి. అందుకే నేను అక్కడ ఆడటాన్ని ఆస్వాదిస్తా. నాలోని దూకుడైనా ఆటగాడు బయటకు వస్తాడు.. నాదైన శైలిని అక్కడ ప్రదర్శించగలను. అయితే, ఐపీఎల్‌ వేలంలో నన్ను ఎవరూ కొననంత మాత్రాన నేనేమీ బాధపడను. 

భవిష్యత్తులో నాకోసం భారత్‌లో అవకాశాలు ఎదురుచూస్తూ ఉంటాయని బలంగా విశ్వసిస్తున్నా. అప్పుడు కచ్చితంగా ఐపీఎల్‌లో ఆడతాను’’ అని షనక తన మనసులోని మాటను వెల్లడించాడు. కాగా షనక ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ లీగ్‌20లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అనుబంధ జట్టు దుబాయ్‌ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన క్యాపిటల్స్‌ జట్టు ముంబై ఎమిరేట్స్‌ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.

చదవండి: IND Vs AUS: ఈజీ క్యాచ్‌ ఇచ్చిన రాహుల్‌.. కోపంతో ఊగిపోయిన రోహిత్‌ శర్మ! వీడియో వైరల్‌
Ravindra jadeja: రోహిత్‌, జడేజా చెప్పే చేశారు! అదేదో అంపైర్‌ ముందు చేయొచ్చు కదా! క్లీన్‌చిట్‌ ఇచ్చాక..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement