
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. తొలుత బౌలింగ్‌లో 177 పరుగులకే ఆసీస్‌ను కట్టడి చేసిన టీమిండియా.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా అదరగొడుతోంది. తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోయి 77 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(56) పరుగులతో క్రీజులో ఉన్నాడు.
నిరాశపరిచిన రాహుల్
ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తీవ్రంగా నిరాశపరిచాడు. 71 బంతులు ఎదుర్కొన్న రాహుల్ ఒక్క ఫోర్ సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. . ఆసీస్ అరంగేట్ర స్పిన్నర్ టాడ్ ముర్ఫీ బౌలింగ్‌లో ఈజీ రిటర్న్ క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్ చేరాడు.
అయితే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ.. రాహుల్ ఔటైన తీరు చూసి షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. రాహుల్ ఔటైన వెంటనే రోహిత్ పైకి చూస్తూ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IND vs AUS: ఆసీస్ స్టార్‌తో అశ్విన్ కవ్వింపు చర్య.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
— Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) February 9, 2023