Sri Lanka Vs Pakistan: Shaheen Afridi Ruled Out Of Second Test - Sakshi
Sakshi News home page

SL Vs PAK: శ్రీలంకతో రెండో టెస్టు.. పాకిస్తాన్‌కు భారీ షాక్‌..!

Jul 22 2022 7:46 AM | Updated on Jul 22 2022 11:29 AM

Shaheen Afridi ruled out of second Test - Sakshi

గాలే వేదికగా జూలై 24 నుంచి శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. గాలేలో జరిగిన మొదటి టెస్టులో అఫ్రిది మోకాలి గాయంతో బాధపడ్డాడు. దాంతో అతడు మ్యాచ్‌ నాలుగు రోజు ఆట మధ్యలో మైదానం వీడాడు.

అయితే అతడి గాయం తీవ్రం కావడంతో కీలక రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇక తొలి టెస్టులో పాక్‌ విజయంలో షాహీన్ షా అఫ్రిది కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు కీలక వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టును కేవలం 222 పరుగులకే కట్టడి చేశాడు. ఇక గాయ పడిన అతడి స్థానంలో యువ పేసర్‌ హరీస్ రవూఫ్ తుది జట్టులోకి రానున్నాడు. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాక్‌ 1-0 అధిక్యంలో ఉంది.
రెండో టెస్టుకు పాకిస్తాన్‌ తుది జట్టు(అంచనా)
అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, అజర్ అలీ, బాబర్ ఆజం (సి), అఘా సల్మాన్, మహ్మద్ రిజ్వాన్ (wk), మహ్మద్ నవాజ్, యాసిర్ షా, హసన్ అలీ,హరీస్ రవూఫ్ , నసీమ్ షా
చదవండి: WI vs IND 1st ODI: వెస్టిండీస్‌తో భారత్ తొలి పోరు.. ధావన్‌కు జోడీ ఎవరు? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement