VHT 2022: షెల్డన్‌ జాక్సన్‌ వీరోచిత సెంచరీ.. విజయ్‌ హజారే ట్రోఫీ విజేత సౌరాష్ట్ర

Saurashtra Beat Maharashra Become Vijay Hazare Trophy Champions 2022 - Sakshi

దేశవాలీ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ విజేతగా సౌరాష్ట్ర నిలిచింది. శుక్రవారం మహారాష్ట్రతో జరిగిన ఫైనల్లో సౌరాష్ట్ర ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. షెల్డన్‌ జాక్సన్‌(136 బంతుల్లో 133 పరుగులు నాటౌట్‌) చివరి వరకు నిలబడి వీరోచిత సెంచరీతో జట్టును గెలిపించాడు. హార్విక్‌ దేశాయ్‌ 50 పరుగులు చేశాడు. ఆఖర్లో చిరాగ్‌ జానీ 25 బంతుల్లో 30 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ 108 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సెంచరీతో జట్టును గెలిపించిన షెల్డన్‌ జాక్సన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

2002-03 సీజన్ నుంచి  విజయ్ హజారే ట్రోఫీని నిర్వహిస్తుండగా  2007-08 సీజన్లో  సౌరాష్ట్ర తొలిసారి ఈ  ట్రోపీని గెలుచుకుంది.  తర్వాత 2017-18 సీజన్ లో ఫైనల్ చేరినా తుదిపోరులో కర్నాటక చేతిలో ఓడింది. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన  జయదేవ్ ఉనాద్కట్‌ సారథ్యంలోని  సౌరాష్ట్ర.. అన్ని విభాగాల్లో రాణించి  లక్ష్యాన్ని అందుకుంది.  ఈ ట్రోఫీని గతంలో తమిళనాడు  5 సార్లు గెలుచుకోగా .. ముంబై నాలుగు సార్లు నెగ్గింది.

చదవండి: Pak Vs Eng: పాక్‌ బౌలర్‌ అత్యంత చెత్త రికార్డు! లిస్టులో భారత క్రికెటర్‌ కూడా

మారడోనా, మెస్సీలను మించినోడు.. జెర్సీ నెంబర్‌-10 ఆ ఆటగాడిదే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top