ప్రపంచ నంబర్‌వన్‌ జోడీగా సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి | Satwik Saira and Chirag Shetty as world number one pair | Sakshi
Sakshi News home page

ప్రపంచ నంబర్‌వన్‌ జోడీగా సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి

Oct 11 2023 3:52 AM | Updated on Oct 11 2023 3:52 AM

Satwik Saira and Chirag Shetty as world number one pair - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి మరో ఘనత సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ర్యాంకింగ్స్‌లో పురుషుల డబుల్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుకున్న తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించింది. మంగళవారం విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో సాత్వి క్‌–చిరాగ్‌ ద్వయం 92,411 పాయింట్లతో అగ్రస్థానాన్ని అలంకరించింది.

గతవారం హాంగ్జౌలో ముగిసిన ఆసియా క్రీడల్లోసాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ స్వర్ణ పతకం సాధించింది. దాంతో ఈ జంట ఒక స్థానం పురోగతి సాధించి రెండు నుంచి టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్‌ చిరాగ్‌ ఈ సీజన్‌లో స్విస్‌ ఓపెన్, ఆసియా చాంపియన్‌íÙప్‌లో, ఇండోనేసియా ఓపెన్, కొరియా ఓపెన్‌లలో విజేతగా నిలిచారు. గతంలో భారత్‌ నుంచి పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రకాశ్‌ పదుకొనే (1980లో), శ్రీకాంత్‌ (2018లో), మహిళల సింగిల్స్‌లో సైనా నెహా్వల్‌ (2021లో) ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచారు. 

Advertisement
 
Advertisement
Advertisement