టోక్యో ఒలింపిక్ప్‌కు సానియా మీర్జా అర్హత | Sania Mirja Qualifies For Tokyo Olympics | Sakshi
Sakshi News home page

టోక్యో ఒలింపిక్ప్‌కు సానియా మీర్జా అర్హత

Apr 8 2021 9:52 AM | Updated on Apr 8 2021 9:55 AM

Sania Mirja Qualifies For Tokyo Olympics - Sakshi

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా నాలుగేళ్ల తర్వాత టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)లో మళ్లీ చోటు సంపాదించింది. బుధవారం జరిగిన మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 34 ఏళ్ల సానియా ప్రత్యేక ర్యాంకింగ్‌ నిబంధన ఆధారంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

సెమీఫైనల్లో సాయిదేదీప్య


సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ర్యాంకింగ్‌ మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సాయిదేదీప్య సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోరీ్నలో బుధవారం జరిగిన సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిదేదీప్య 6–2, 6–4తో అవిష్క గుప్తా (జార్ఖండ్‌)పై గెలిచింది. డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిదేదీప్య–అవిష్క జంట 1–6, 6–4, 6–10తో స్నిగ్ధ (కర్ణాటక)–వేద (తెలంగాణ) జోడీ చేతిలో ఓడిపోయింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement