KS Bharat: ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలనేది ఎన్నో ఏళ్ల కల

సాక్షి ఫోన్ ఇంటర్య్వూలో కేఎస్ భరత్
KS Bharart... ఐపీఎల్ లీగ్ చివరి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ జట్టు తరఫున కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు విశాఖ కుర్రాడు శ్రీకర్ భరత్. కోహ్లీతో సహా మరో ఓపెనర్ ఆరుపరుగుల స్కోర్‌కే పెవిలియన్‌కు చేరిన దశలో టాప్‌లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై మరుపురాని ఇన్నింగ్స్‌తో వికెట్ కీపర్ భరత్ చరిత్రలో నిలిచిపోయాడు. ఈ మ్యాచ్‌లో భరత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భరత్ షార్జా నుంచి ఫోన్‌లో ‘సాక్షి’తో మాట్లాడాడు.
Courtesy: IPL Twitter
ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలని ఎన్నో ఏళ్ల నుంచి కల కంటున్నానని చెప్పాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి ఐదు పరుగులు కావల్సిన స్థితిలో లాంగ్‌ఆన్ మీదుగా భారీ సిక్సర్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాయల్స్‌పై 44, ముంబైపై 32, సన్‌రైజర్స్‌పై 12 పరుగులు చేసిన భరత్ లీగ్ చివరి మ్యాచ్‌లో(78నాటౌట్) మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది తానేంటో చూపించి విశాఖ కీర్తిని ఇనుమడింపజేశాడు. నాకవుట్‌లో 11న నైట్‌రైడర్స్‌తో షార్జాలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడడానికి సిద్ధమవుతున్నాడు.
Courtesy: IPL Twitter
చదవండి: KS Bharat: కప్ కొట్టి కోహ్లి చేతిలో పెట్టడమే లక్ష్యం
Virat Kohli Celebration: సిక్స్‌తో గెలిపించిన శ్రీకర్ భరత్.. కోహ్లి రచ్చ రచ్చ