source: X
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 390 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాటర్ మ్యాట్ రెన్షా (190) వీరోచితంగా పోరాడి అద్భుత శతకంతో మెరిశాడు. అతడికి టెయిలెండర్లు కమిన్స్ (43), లియోన్ (27), హాజిల్‌వుడ్ (5 నాటౌట్) సహకరించినప్పటికీ, తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.
124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన ఆసీస్‌ను రెన్షా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఈ క్రమంలో కెరీర్‌లో తన రెండో టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకోవడమే కాకుండా, తన జట్టును పట్టిష్టమైన స్థానంలో ఉంచాడు. ఆసీస్ ఇన్నింగ్స్ మొత్తాన్ని రెన్షా ఒంటిచేత్తో నిర్మించాడు. అతడికి టెయిలెండర్లు మద్దతుగా నిలిచారు.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో మ్యాడిసన్ డకౌట్ కాగా.. ట్రవిస్ హెడ్ 9, లబూషేన్ 37, స్టీవ్ స్మిత్ 25, అలెక్స్ క్యారీ 14, వెబ్‌స్టర్ 4, స్టార్క్ 6 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ముల్దర్ 4, యార్కో యాన్సెన్ 3, అన్రిచ్ నోర్జే 2, సైమన్ హార్మర్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. దీనికి ముందు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆసీస్ 1-2 తేడాతో కోల్పోయింది. వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది.
ఇదీ చదవండి: భారత జట్టుకు ఎంపిక కాకపోతే అది నా నష్టం కాదు..!


