మహిళా క్రికెటర్‌తో ట్వీటర్‌ క్లాష్‌: ఈసీబీ వార్నింగ్‌

Rory Burns Reprimanded By ECB After Clash With Female Cricketer - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ క్రికెటర్‌ రోరీ బర్న్స్‌కు ఈసీబీ వార్నింగ్‌ ఇచ్చింది.  ఆ దేశ మహిళా క్రికెటర్‌ అలెక్స్ హార్ట్లీ సరదాగా చేసిన ట్వీట్‌ను సీరియస్‌గా తీసుకున్న బర్న్స్‌ అందుకు ఆమెతో ట్వీటర్‌ వేదికగా వాదనకు దిగాడు. దీనిపై ఈసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా క్రికెటర్‌ చేసిన ట్వీట్‌పై అంతలా స్పందించాల్సిన అవసరం లేదని బర్న్స్‌కు తెలిపింది. ఈ క్రమంలోనే అతనికి మందలింపుతో సరిపెట్టింది. ఈ తరహా ఘటనలు మళ్లీ రిపీట్‌ కాకూడదని భారత్‌ పర్యటనలో ఉన్న ఆ జట్టు మేనేజ్‌మెంట్‌కు స్పష్టం చేసింది. దాంతో బర్న్స్‌ ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించాడు.  ఇక్కడ చదవండి: కీలకమైన నాల్గో టెస్టుకు బుమ్రా దూరం

వివరాల్లోకి వెళ్తే..  ఇంగ్లండ్ మహిళలు, న్యూజిలాండ్ మహిళల మధ్య జరిగిన సెకండ్ వన్డే‌ను ఉద్దేశించి అలెక్స్ హార్ట్లీ చేసిన ట్వీట్ బెడిసి కొట్టింది. ‘బాగుంది అబ్బాయిలు.. న్యూజిలాండ్ మహిళల మ్యాచ్ ప్రారంభానికి ముందే టెస్ట్ మ్యాచ్‌ను పూర్తి చేయడం బాగుంది'అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై రోరీ బర్న్స్ సైతం తీవ్ర అభంతరం వ్యక్తం చేశాడు. మహిళల క్రికెట్‌కు మద్దతు లభించేందుకు తాము ఓడిపోవాలనుకోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యమైనది కాదన్నాడు. ‘అబ్బాయిలందరూ మహిళల క్రికెట్‌కు మద్దతు ఇవ్వడానికి ఇది నిరాశపరిచే వైఖరి'అంటూ హార్ట్లీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు.

ఇక రోరీ బర్న్స్ ట్వీట్‌ను బెన్ స్టోక్స్‌తో సహ జేమ్స్ అండర్సన్ లైక్ చేయడం గమనార్హం.  భారత్‌తో అహ్మదాబాద్‌ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన మ్యాచ్‌ మరుసటిరోజు ఇంకా పూర్తి కాకుండానే ముగిసింది.  కాగా, ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మహిళా జట్ల మధ్య జరిగిన రెండో వన్డే శుక్రవారం జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను ఇంకా వన్డే మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ మహిళల జట్టు కైవసం చేసుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top