అభిమానుల మనసు గెలుచుకున్న రోహిత్‌ శర్మ.. వీడియో వైరల్‌ | Ind Vs Aus: Rohit Sharma Wins Heart As Skipper Gave Winning Series Trophy To KL Rahul, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IND Vs AUS 3rd ODI: అభిమానుల మనసు గెలుచుకున్న రోహిత్‌ శర్మ.. వీడియో వైరల్‌

Sep 28 2023 9:23 AM | Updated on Sep 28 2023 10:31 AM

 Rohit Sharma wins heart as skipper hands series trophy to KL Rahul - Sakshi

రాజ్‌​కోట్‌ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 66 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే తొలి రెండు వన్డేల్లో విజయం సాధించడంతో సిరీస్‌ను 2-1తో టీమిండియానే సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిమానుల మనసులను గెలుచుకున్నాడు.

రోహిత్‌ ఏం చేశాడంటే?
కాగా ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు రోహిత్‌ శర్మ గైర్హజరీ నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌ భారత జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు అద్భుత విజయం సాధించింది. రాహుల్‌ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో అకట్టుకున్నాడు. ఇక మూడో వన్డే అనంతరం ప్రెజెంటేషన్ వేడుకలో విన్నింగ్‌ ట్రోఫీని అందుకోవాలని భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మను హర్షబోగ్లే ఆహ్వానించాడు.

అయితే రోహిత్‌ ఇక్కడే తన మంచి మనసును చాటుకున్నాడు. ట్రోఫీని అందుకోవడానికి రోహిత్‌ తనకు బదులుగా రాహుల్‌ను వెళ్లమని ప్రోత్సహించాడు. అంతేకాకుండా ట్రోఫీతో ఫోటో దిగే సమయంలో కూడా రోహిత్‌ కేవలం ఒక్క ఆటగాడిగా మాత్రమే ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు హిట్‌మ్యాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
చదవండి: Rohit Sharma: చాలా సంతోషంగా ఉన్నా.. అతడు మాత్రం అద్భుతం! వరల్డ్‌కప్‌లో కూడా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement