IND vs WI, 1st T20I: Rohit Sharma 20 Runs Away from Massive Batting Record - Sakshi
Sakshi News home page

IND vs WI: వెస్టిండీస్‌తో తొలి టీ20.. అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్‌ శర్మ..!

Jul 29 2022 6:46 PM | Updated on Jul 29 2022 8:22 PM

Rohit Sharma 20 Runs Away from Massive Batting Record - Sakshi

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా.. ఇప్పడు టీ20 సిరీస్‌లో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమైంది. శుక్రవారం(జూలై 29) బ్రియన్‌ లారా స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరుగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తుంది. విండీస్‌తో తొలి టీ20లో రోహిత్‌ మరో 20 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మార్టిన్‌ గుప్తిల్‌ (3399) పరుగులతో తొలి స్థానంలో ఉండగా, రోహిత్‌(3379) పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక విండీస్‌తో వన్డేలకు విశ్రాంతి తీసుకున్న రోహిత్‌ శర్మ తిరిగి టీ20 సిరీస్‌తో సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అతడితో పాటు రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌ కూడా భారత జట్టులో చేరారు. ఇక కరోనా బారిన పడ్డ కేఎల్‌ రాహుల్‌ ఈ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.

భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ , ఆవేశ్‌ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.
చదవండి: Sanju Samson In T20I Squad: విండీస్‌తో తొలి టి20.. టీమిండియాకు గుడ్‌న్యూస్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement