Road Safety World Series 2022: ఇండియా లెజెండ్స్‌తో సౌతాఫ్రికా దిగ్గజాల 'ఢీ'

Road Safety World Series 2022: India Legends Take On South Africa Legends In First Match - Sakshi

బీసీసీఐ సహకారంతో భారత రోడ్డు రవాణ, హైవేలు మరియు ఐటీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ సీజన్‌-2 ఇవాల్టి (సెప్టెంబర్‌ 10) నుంచి ప్రారంభంకానుంది. మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ టోర్నీ నేటి నుంచి ఆక్టోబర్‌ 1 వరకు కాన్పూర్‌, రాయ్‌పూర్‌, ఇండోర్‌, డెహ్రడూన్‌ వేదికలుగా జరుగనుంది. ఈ సీజన్‌ ఆరంభం మ్యాచ్‌లో ఇవాళ ఇండియా లెజెండ్స్‌, సౌతాఫ్రికా లెజెండ్స్‌ తలపడనున్నాయి. కాన్పూర్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇండియా లెజెండ్స్‌ దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సారధ్యంలో మరోసారి బరిలోకి దిగనుండగా.. సౌతాఫ్రికా లెజెండ్స్‌ దిగ్గజ ఫీల్డర్‌ జాంటీ రోడ్స్‌ నేతృత్వంలో పోటీపడనుంది. రాత్రి 7:30 గంటలకు  ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ను కలర్స్‌ సినీప్లెక్స్‌, కలర్స్‌ సినీప్లెక్స్‌ హెచ్‌డీ, కలర్స్‌ సినీప్లెక్స్‌ సూపర్‌ హిట్స్‌, స్పోర్ట్స్‌18 ఖేల్‌ ఛానల్‌లు లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తున్నాయి. ఈ సిరీస్‌లో జరిగే 23 మ్యాచ్‌లు పై పేర్కొన్న ఛానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

వీటితో ఈ సిరీస్‌లోని మొత్తం మ్యాచ్‌లను వూట్ యాప్, వెబ్‌సైట్‌లో కూడా చూడవచ్చు. దిగ్గజాల పోరును ఫ్రీగా చూడాలంటే జియో టీవీ యాప్ ద్వారా చూడవచ్చు. ఈ సిరీస్‌లో ఇండియా, సౌతాఫ్రికా లెజెండ్స్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ దిగ్గజ జట్లు పాల్గొంటున్నాయి.  రోడ్‌ సేఫ్టీపై విశ్వవ్యాప్తంగా అవగాహణ పెంచేందుకు ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ తొలి ఎడిషన్‌లో సచిన్‌ కెప్టెన్సీలో ఇండియా లెజెండ్స్‌ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచింది.

జట్ల వివరాలు..
ఇండియా లెజెండ్స్‌: సచిన్‌ టెండూల్కర్‌ (కెప్టెన్‌), నమన్‌ ఓజా (వికెట్‌కీపర్‌), యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, యూసఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, స్టువర్ట్‌ బిన్నీ, మన్‌ప్రీత్‌ గోని, హర్భజన్‌ సింగ్‌, మునాఫ్‌ పటేల్‌, వినయ్‌ కుమార్‌, అభిమన్యు మిథున్‌, ప్రగ్యాన్‌ ఓజా, బాలసుబ్రమన్యమ్‌, రాహుల్‌ శర్మ, రాజేశ్‌ పవార్‌

సౌతాఫ్రికా లెజెండ్స్‌: జాంటీ రోడ్స్‌ (కెప్టెన్‌), మోర్నీ వాన్‌ విక్‌ (వికెట్‌కీపర్‌), అల్విరో పీటర్సన్‌, జాక్‌ రుడాల్ఫ్‌, హెన్రీ డేవిడ్స్‌, వెర్నాన్‌ ఫిలాండర్‌, జోహాన్‌ బోథా, లాన్స్‌ క్లూసనర్‌, జాండర్‌ డి బ్రూన్‌, మఖాయ ఎన్తిని, గార్నెట్‌ క్రుగర్‌, ఆండ్రూ పుట్టిక్‌, జోహాన్‌ వాండర్‌ వాత్‌, థండి షబలాల, ఎడ్డీ లీ, ల్యాడ్‌ నోరిస్‌ జోన్స్‌
చదవండి: సెంచరీ చేయకుండా మూడేళ్లు కొనసాగడం కోహ్లికే సాధ్యమైంది..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top