
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20లో ఓటమికి దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. కార్డిఫ్ వేదికగా గురువారం రాత్రి జరిగిన రెండో టి20లో ప్రొటిస్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా బ్యాటర్ రిలీ రొసోవ్(55 బంతుల్లో 96 నాటౌట్, 10 ఫోర్లు, 5 సిక్సర్లు) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి రీజా హెండ్రిక్స్(32 బంతుల్లో 53 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌తో సహకరించాడు.
కాగా రిలీ రోసోవ్ ఆరేళ్ల తర్వాత మళ్లీ సౌతాఫ్రికా తరపున బరిలోకి దిగాడు. 2016లో ఆఖరుసారి దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన రొసోవ్ 36 వన్డేల్లో 1239 పరుగులు, 17 టి20ల్లో 427 పరుగులు చేశాడు. వీరిద్దరి దాటికి ఇంగ్లండ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోగా.. దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌటైంది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో 30 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. జాస్ బట్లర్ 29 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫెక్యుల్‌వాయో, తబ్రెయిజ్ షంసీలు చెరో మూడు వికెట్లు తీయగా.. ఎంగిడి 2, రబాడ, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రొసోవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో సౌతాఫ్రికా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సిరీస్‌లో చివరిదైన మూడో టి20 జూలై 31(ఆదివారం) జరగనుంది.
చదవండి: Chess Olympiad: భారత్‌పై విషం చిమ్మిన పాకిస్తాన్..
Gustav McKeon: 18 ఏళ్ల వయసులో అదిరిపోయే రికార్డులు.. ఎవరీ క్రికెటర్?