మేరీకోమ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా

Renault India Honors Tokyo Olympics 2020 Flagbearer Mary Kom Gifts SUV - Sakshi

ఢిల్లీ: 2012 లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత.. ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ మేరీకోమ్‌కు రినాల్డ్‌ ఇండియా ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌ 2020 ఫ్లాగ్‌ బేరర్‌గా(పతాకధారి) వ్యవహరించిన మేరీకోమ్‌కు రినాల్డ్‌ ఇండియా కైగర్‌ కంపాక్ట్‌ ఎస్‌యూవీ మోడల్‌ కారును అందించింది. అంతకముందు టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత.. భారత మహిళ వెయిట్‌లిఫ్టర్‌ మీరాభాయి చానుకు కూడా రినాల్డ్‌ కైగర్‌ కంపాక్ట్‌ ఎస్‌యూవీ మోడల్‌ కారునే గిఫ్ట్‌గా అందించింది.

కాగా షినీ విల్సన్‌, అంజూ బాబీ జార్జీ తర్వాత మేరీకోమ్‌ ఒలింపిక్స్‌లో ఫ్లాగ్‌బేరర్‌గా వ్యవహరించిన మూడో భారత మహిళ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం తెస్తుందనుకున్న మేరీకోమ్‌ క్వార్టర్స్‌ చేరకుండానే రెండో రౌండ్‌లోనే తిరుగుముఖం పట్టింది. రౌండ్ 16 పోరులో కొలంబియన్ బాక్సర్ వాల్నసీయా విక్టోరియా చేతిలో మేరి కోమ్ ఓటమి పాలైంది. 3-2 తేడాతో మేరీ కోమ్ ఓటమి పాలైంది. కాగా లండన్‌ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌లో మేరీకోమ్‌ క్యాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. అయితే వయసు రిత్యా చూస్తే మాత్రం మేరీకోమ్‌కు ఇవే ఆఖరి ఒలింపిక్స్‌ అని అంతా భావించారు. కానీ తాను 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో కచ్చితంగా పాల్గొంటానని మేరీకోమ్‌ ధీమా వ్యక్తం చేసింది.

చదవండి: Mary Kom: నాకింకా వయసైపోలేదు. మరో నాలుగేళ్లు ఆడతా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top