IPL 2022 RCB Vs CSK: Akash Deep Bowls 11 Balls To Take Single Over, Creates Worst Record - Sakshi
Sakshi News home page

Akash Deep: ఆర్‌సీబీ బౌలర్‌ పేరిట అత్యంత చెత్త రికార్డు

Apr 12 2022 11:18 PM | Updated on Apr 13 2022 8:47 AM

RCB bowler Akash Deep Bowls 11-balls Single Over concedes 24 runs - Sakshi

Courtesy: IPL Twitter

ఆర్‌సీబీ బౌలర్‌ ఆకాశ్‌ దీప్‌ ఐపీఎల్‌ 2022లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌లో 11 బంతులు వేసి సీజన్‌లోనే అత్యంత చెత్త ఓవర్‌ వేశాడు. అంతేకాదు 11 బంతులు వేసిన ఆకాశ్‌ దీప్‌ 24 పరుగులిచ్చుకోవడం విశేషం. ఓవరాల్‌గా 4 ఓవర్లలో 58 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అప్పటికే ఊతప్ప- శివమ్‌ దూబే జోడి పూనకం వచ్చినట్లుగా ఆడుతుండడంతో బంతి ఎవరికి ఇవ్వాలో అర్థంగాక డుప్లెసిస్‌ తలకు చేతులు పెట్టుకున్నాడు.

ఈ దశలో 18వ ఓవర్‌ వేయమని ఆకాశ్‌ దీప్‌ చేతిలో బంతిని పెట్టాడు. ఆ ఓవర్‌ పూర్తి చేయడానికి ఆకాశ్‌ దీప్‌ 11 బంతులు తీసుకున్నాడు. తొలి నాలుగు బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ రావడంతో ఆకాశ్‌ దీప్‌ ఒత్తిడిలో బౌలింగ్‌లో లయ తప్పాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు వైడ్స్‌ వేశాడు. ఆ తర్వాత మరో రెండు బంతులు వేసిన ఆకాశ్‌ దీప్‌ ఓవరాల్‌గా 24 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఆకాశ్‌ దీప్‌ను ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేశారు.'' ఒక ఓవర్‌లో ఆరు బంతులు ఉంటాయన్న సంగతి మరిచిపోయినట్లున్నాడు.. ఇంకొక బంతి వేసుంటే.. రెండు ఓవర్లను ఒకే ఓవర్‌లో వేసిన బౌలర్‌గా చరిత్రకెక్కేవాడివి.. మిస్‌ చేసుకున్నావు'' అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌ చరిత్రలో ఊతప్ప-శివమ్‌ దూబే జోడి అరుదైన ఫీట్‌

Shivam Dube: 11 ఏళ్ల రికార్డు సమం చేసిన శివమ్‌​ దూబే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement