
టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అతడు బాధ్యతలు చేపట్టిన ఈ ఎనిమిది నెలల్లో విరాట్ కోహ్లి, రోహిత్, ధావన్, రాహుల్, పంత్ వేర్వేరు సిరీస్‌లలో టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించారు. టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయాలు, పనిభారంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
దీంతో అతడి స్థానంలో దక్షిణాఫ్రికా పర్యటనకు కేఎల్ రాహుల్, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు పంత్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించారు. మరో వైపు ఐర్లాండ్‌తో జరగబోయే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా మొదటిసారి భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఎనిమిది నెలల వ్యవధిలో అన్నీ ఫార్మాట్లలో కలిపి భారత జట్టుకు ఆరుగురు సారథులుగా వ్యవహరించడంపై తాజాగా రాహుల్ ద్రవిడ్ వివరణ ఇచ్చాడు.
"టీమిండియాకు కోచ్ వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది. కోచ్ పదవి అనేది పెద్ద సవాలు వంటింది. గత ఎనిమిది నెలల్లో మా జట్టుకు ఆరుగురు కెప్టెన్‌లుగా బాధ్యతలు నిర్వహించారు. వాస్తవానికి.. నేను కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు నా ప్రణాళిక ఇది కాదు. కానీ కరోనా, గాయాలు, ఆడుతున్న మ్యాచ్‌ల సంఖ్య వల్ల ఇలా జరిగింది. అయితే ఇలా జరగడం వల్ల యువ ఆటగాళ్లకు నాయకత్వం వహించే అవకాశం లభించింది. అదే విధంగా భవిష్యత్తు కెప్టెన్‌లను తాయారు చేసే అవకాశాలు మాకు లభించాయి" అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
చదవండి: Wriddhiman Saha: త్రిపుర జట్టుకు మెంటార్‌గా వృద్ధిమాన్ సాహా..!