Indonesia Open 2024: పీవీ సింధుకు మరో ఘోర పరాభవం.. | PV Sindhu, ousted in first round of Indonesia Open by Wen Chi Hsu | Sakshi
Sakshi News home page

Indonesia Open 2024: పీవీ సింధుకు మరో ఘోర పరాభవం..

Jun 5 2024 2:02 PM | Updated on Jun 5 2024 2:04 PM

 PV Sindhu, ousted in first round of Indonesia Open by Wen Chi Hsu

సింగపూర్ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌లోనే ఓటమి పాలైన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు మరో పరాభవం ఎదురైంది. ఇండోనేషియా ఓపెన్‌లో తొలి రౌండ్‌లో సింధు ఓటమి చవిచూసింది. ఇండోనేషియా ఓపెన్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో చైనీస్‌ తైపీ షట్లర్‌ వెన్ చి హ్సుతో చేతిలో సిందు పరాజయం పాలైంది.

వరుసగా మూడు గేమ్స్‌లో 15-21, 21-15, 14-21 తేడాతో ఓడిన సింధు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌లో ప్రత్యర్ధికి గట్టి పోటీనిచ్చిన సింధు.. రెండు రౌండ్‌లో మాత్రం అద్బుతంగా పుంజుకుని వెన్ చి హ్సు ఓడించింది.

కానీ ఫలితాన్ని తేల్చే మూడో గేమ్‌లో మాత్రం సింధు ప్రత్యర్ధి ముందు తేలిపోయింది. దీంతో తొలి రౌండ్‌లోనే సింధు కథ ముగిసింది. కాగా పారిస్ ఒలింపిక్స్‌కు ముందు సింధుకు మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి.

ఈ ఓటమి కంటే ముందు సింగపూర్ ఓపెన్‌తో పాటు మలేషియా మాస్టర్స్‌ టోర్నీ ఫైనల్లో సిందు పరాజయం చవిచూసింది.

Advertisement
 
Advertisement
Advertisement