ట్రెంట్‌బ్రిడ్జి వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (21 బంతుల్లో 36) పర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 43 పరుగులో జోడించారు.
ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఇంగ్లండ్ స్కోరు మందగించింది. ఒక దశలో 160 నుంచి 170 పరుగులకు పరిమితమవుతుందనుకున్న ఇంగ్లండ్.. చివర్లో సామ్ కరన్ (24 బంతుల్లో 41 నాటౌట్), విల్ జాక్స్ (7 బంతుల్లో 14) మెరుపులతో 200 పరుగుల మార్క్‌ను దాటింది. భారత బౌలర్లలో హర్షిత్ రానా, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.


