ICC Women’s World Cup 2022: పాకిస్తాన్‌ సంచలన విజయం.. పదమూడేళ్ల తర్వాత తొలిసారి!

Pakistan end 18 match losing streak to register first win in 13 years  - Sakshi

మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. హామిల్టన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ ఘన విజయం సాధించింది.  కాగా 2009 తర్వాత పాకిస్తాన్‌ తొలిసారి ప్రపంచకప్‌లో విజయం సాధించింది. ఇక వర్షం కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. ఇక మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ మొదట వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెండీస్‌.. పాకిస్తాన్‌ స్పిన్నర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 89 పరుగుల మాత్రమే చేయగల్గింది. పాక్‌ స్పిన్నర్‌  నిదా దార్ కేవలం 10 పరుగుల మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. విండీస్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ డాటిన్‌(27) తప్ప మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇక 90 పరుగుల లక్ష్యంతో బరిలో​కి దిగిన పాకిస్తాన్‌ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. పాక్‌ బ్యాటర్లలో మునీబా అలీ(37), కెప్టెన్‌ మహారూప్‌(20)పరుగులతో రాణించారు.

చదవండి: IPL 2022: 'ఢిల్లీ జట్టు చాలా వీక్‌.. ఓపెనర్‌గా న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top