IPL 2022: 'ఢిల్లీ జట్టు చాలా వీక్‌.. ఓపెనర్‌గా న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు'

Aakash Chopra picks his Delhi Capitals XI for the first few matches of IPL 2022 - Sakshi

ఐపీఎల్‌-2022 మార్చి 26నుంచి ప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు అంతర్జాతీయ సిరీస్‌లు కారణంగా విదేశీ స్టార్‌ ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు కూడా విదేశీ ఆటగాళ్లు దూరం కానున్నారు. దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ అన్రీచ్‌ నోర్జే జట్టులో చేరినప్పటికీ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటు ఇంకా సందిగ్ధం నెలకొంది. మరో వైపు ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, మిచ్‌ల్‌ మార్ష్‌ కూడా ఆరంభ మ్యాచ్‌లకు ఢిల్లీ జట్టుకు దూరం కానున్నారు.

వీరిద్దరూ పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టులో భాగమై ఉన్నారు. పాకిస్తాన్‌ పర్యటన ముగిసిన అనంతరం వీరిద్దరూ జట్టులో చేరనున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాష్‌ చోప్రా ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును ఎంచుకున్నాడు. అదే విధంగా ఆరంభ మ్యాచ్‌లకు ఢిల్లీ జట్టు చాలా వీక్‌గా ఉందని చోప్రా పేర్కొన్నాడు. అతడు ఎంచుకున్న జట్టులో ఓపెనర్లుగా న్యూజిలాండ్‌ బ్యాటర్‌ టిమ్ సీఫెర్ట్, భారత యువ ఆటగాడు పృథ్వీ షాను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు.

మూడు, నాలుగు స్ధానాల్లో వరుసగా శ్రీకర్‌ భరత్‌, కెప్టెన్‌ పంత్‌కు అవకాశం ఇచ్చాడు. ఇక ఐదో స్ధానంలో వెస్టిండీస్‌ పవర్‌ హిట్టర్‌ రోవ్‌మన్ పావెల్‌ను ఎంపిక చేశాడు. ఆరో స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్‌న్‌కు ఛాన్స్‌ ఇచ్చాడు. ఇక ఆల్‌రౌండర్‌ కోటాలో అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్‌ను ఎంచుకున్నాడు. ఇక తన జట్టులో స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్‌ యాదవ్‌ను ఎంపికచేశాడు. అదే విధంగా ఫాస్ట్‌ బౌలర్ల కోటాలో లుంగీ ఎన్‌గిడి, ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఆకాష్‌ చోప్రా ఎంచుకున్నాడు.

ఆకాష్‌ చోప్రా ఎంచుకున్న జట్టు: పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, కేఎస్ భరత్, రిషబ్ పంత్(కెప్టెన్‌), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎన్‌గిడి, ముస్తాఫిజుర్ రెహమాన్

చదవండి: IPL 2022- KL Rahul: పంజాబ్‌ కింగ్స్‌ను వీడటానికి ముఖ్య కారణం అదే: కేఎల్‌ రాహుల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top