Nooshin Al Khadeer Appointed Interim Head Coach Of Indian Women's Team For Bangladesh Tour - Sakshi
Sakshi News home page

IND-W vs BAN-W: బంగ్లాదేశ్‌ టూర్‌.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా మాజీ క్రికెటర్‌!

Published Wed, Jul 5 2023 1:43 PM

Nooshin Al Khadeer appointed interim head coach of Indian womens team for upcoming Bangladesh tour - Sakshi

బంగ్లాదేశ్‌ పర్యటనకు భారత మహిళల జట్టు అన్ని విధాల సిద్దమవుతోంది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ అతిథ్య బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇప్పటికే ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూలై 9న జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌తో భారత పర్యటన ప్రారంభం కానుంది. మరో రెండు రోజుల్లో బంగ్లాదేశ్‌కు హర్మన్‌ సేన పయనం కానుంది.

భారత జట్టు హెడ్‌ కోచ్‌గా నూషిన్ అల్ ఖదీర్‌
కాగా గత డిసెంబర్‌లో మహిళల జట్టు హెడ్‌కోచ్‌గా ఉన్న రమేశ్ పొవార్‌ని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి బీసీసీఐ బదిలి చేసింది. దీంతో అప్పటి నుంచి ప్రధాన కోచ్ లేకుండానే భారత మహిళల జట్టు ఆడుతూ వస్తుంది.

ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత మహిళల జట్టు హెడ్‌ కోచ్‌ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్‌కోచ్‌ పదవి కోసం ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు జోన్ లూయిస్, భారత మాజీ కోచ్‌ ‍తుషార్ అరోథే, అమోల్ ముజుందార్ వంటి వారు దరఖాస్తు చేసుకున్నారు. 

అయితే ముంబై దిగ్గజ ఆటగాడు అమోల్ ముజుందార్ పేరును క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) కమిటీ ఫైనల్‌ చేసిందని వార్తలు వినిపించాయి. కానీ బీసీసీఐ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు చేయలేదు. అయితే బంగ్లా టూర్‌కు సమయం దగ్గరపడుతుండడంతో మాజీ భారత క్రికెటర్ నూషిన్ అల్ ఖదీర్‌ను తాత్కాలిక ప్రధాన కోచ్‌గా బోర్డు నియమించింది. కోచ్‌గా ఖదీర్‌కు అపారమైన అనుభవం ఉంది.  కాగా మొట్టమొదటి మహిళల అండర్‌-19 ప్రపం‍చకప్‌ గెలిచిన భారత జట్టుకు నూషిన్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించింది. 
చదవండి: Online Betting: మ్యాచ్‌ మ్యాచ్‌కు ఉత్కంఠ.. ఉన్నదిపాయే, ఉంచుకున్నది పాయే! జీవితమే!

Advertisement
Advertisement