సచిన్‌ను మించిన వాళ్లు లేరు! ఆ విషయంలో కోహ్లి కంటే బాబర్‌ బెటర్‌: పాక్‌ మాజీ స్పిన్నర్‌

No One Bigger Than Sachin Has Kohli Faced These Bowlers: Saqlain Mushtaq - Sakshi

Sachin Tendulkar- Virat Kohli: ‘‘బ్యాటర్లందరిలో సచిన్‌ టెండుల్కర్‌ను మించిన వాళ్లు ఎవరూ లేరు. ఈ మాట నా ఒక్కడిదే కాదు.. ప్రపంచమంతా అంగీకరించే వాస్తవం. క్రికెట్‌లో ఎలాంటి షాట్‌ గురించి చెప్పాలన్నా దాదాపుగా ప్రతి ఒక్కరు సచిన్‌ ఆట తీరునే ఉదాహరణగా చెబుతారు. ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచంలో విరాట్‌ కోహ్లి లెజెండ్‌గా ఎదిగి ఉండవచ్చు.

కానీ నా దృష్టిలో సచిన్‌ కంటే ఎవరూ ఎక్కువ కాదు. సచిన్‌ ఎంతో మంది కఠినమైన బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఇప్పుడున్న బౌలర్లతో పోలిస్తే అప్పటివాళ్లు మరింత మెరుగ్గా ఆడేవారు. కోహ్లి ఏమైనా.. వసీం అక్రమ్‌, వాల్ష్‌, అంబ్రోస్‌, మెగ్రాత్‌, షేన్‌ వార్న్‌, మురళీధరన్‌ వంటి బౌలర్లను ఎదుర్కొన్నాడా? ప్రపంచంలోని అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన బౌలర్లు వీళ్లు.

వీళ్లందరి బౌలింగ్‌ను సచిన్‌ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. వీళ్లకు బ్యాటర్‌ను పరుగులు చేయకుండా ఎలా ఆపాలో తెలుసు.. ట్రాప్‌లో ఎలా పడేయాలో కూడా తెలుసు. ఇప్పుడున్న వాళ్లలో చాలా తక్కువ మందిలో ఈ రెండు నైపుణ్యాలు కలగలిసి ఉన్నాయి’’ అని పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ సక్లెయిన్‌ ముస్తాక్‌ అన్నాడు.

విరాట్‌ కోహ్లి కంటే సచిన్‌ ఎప్పుడూ ఓ మెట్టు పైనే ఉంటాడని.. మాస్టర్‌ బ్లాస్టరే అసలైన ‘‘GOAT(Greatest of All Time)’’ అని పేర్కొన్నాడు. కాగా సచిన్‌ సెంచరీల సెంచరీ రికార్డుకు గురువారం (మార్చి 16)పదకొండేళ్లు పూర్తయ్యాయి. ఇక సచిన్‌ సాధించిన ఈ అరుదైన ఫీట్‌కు కోహ్లి ఇంకా 25 అడుగులు దూరంలో ఉన్న విషయం తెలిసిందే. 

ఆ విషయంలో బాబర్‌ బెటర్‌
ఈ నేపథ్యంలో సక్లెయిన్‌ ముస్తాక్‌ నాదిర్‌ అలీ షోలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక కోహ్లితో.. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను పోల్చడంపై స్పందిస్తూ.. ‘‘ఇద్దరూ తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. అయితే, కోహ్లి కంటే బాబర్‌ కవర్‌ డ్రైవ్స్‌ మరింత మెరుగ్గా ఆడగలడు’’ అని ఈ పాక్‌ మాజీ బౌలర్‌ పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలో కోహ్లి ఫ్యాన్స్‌ సక్లెయిన్‌ ముస్తాక్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచిన్‌ లెజెండ్‌ అన్న విషయంలో సందేహం లేదని, అయితే కోహ్లిని బాబర్‌తో పోల్చి కింగ్‌ స్థాయిని తగ్గించవద్దని చురకలు అంటిస్తున్నారు. కాగా ముస్తాక్‌ తన కెరీర్‌లో మొత్తంగా 496 వికెట్లు తీశాడు.

చదవండి: WTC Final: అతడు అత్యుత్తమ బౌలర్‌.. డబ్ల్యూటీసీ ట్రోఫీ గెలిచేది వాళ్లే: ఆసీస్‌ మాజీ కెప్టెన్‌
సచిన్‌ రికార్డు బద్దలు కొట్టగలిగేది అతడే.. 110 సెంచరీలతో: పాక్‌ మాజీ పేసర్‌

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top