సందీప్ లమిచ్చానే, నేపాల్ క్రికెటర్
Sandeep Lamichhane As ICC Mens Palyer Of Month.. సెప్టెంబర్ నెలకు గానూ ప్రతిష్టాత్మక మెన్స్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును నేపాల్ లెగ్ స్పిన్నర్ సందీప్ లమిచ్చానే సొంతం చేసుకున్నాడు. ఇక మహిళల విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన హెథర్ నైట్ వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికైంది. కాగా లమిచ్చానేకు బంగ్లాదేశ్ బౌలర్ నసూమ్ అహ్మద్, యూఎస్‌ఏ బ్యాటర్ జస్క్రన్ మల్హోత్రాలతో గట్టిపోటీ ఎదురైంది. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ 2లో చేసిన ప్రదర్శన ఆధారంగానే సందీప్ లమిచ్చానే ఈ అవార్డుకు ఎంపికయ్యడంటూ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, ఐసీసీ ఓటింగ్ అకాడమీ మెంబర్ జేపీ డుమిని పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2021: మూడో స్థానం అంటే చాలా ఇష్టం.. అవకాశమొస్తే

హెథర్ నైట్, ఇంగ్లండ్ మహిళ క్రికెటర్
ఆ టోర్నమెంట్‌లో 6 వన్డేలాడిన లమిచ్చానే 3.17 ఎకానమీ రేటుతో 18 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఒమన్, పపువా న్యూజినియాతో జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పపువా న్యూ జినియాతో మ్యాచ్‌ల్లో 4/35, 6/11 నమోదు చేసిన లమిచ్చానే ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4/18తో మెరిశాడు. కాగా లమిచ్చానే గతంలో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక నేపాల్ తరపున 16 వన్డేల్లో 41 వికెట్లు.. 26 టి20ల్లో 47 వికెట్లు పడగొట్టాడు.
ఇక వుమెన్స్ విభాగంలో అవార్డు గెలుచుకున్న హెథర్ నైట్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 4-1తో గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించింది. బ్యాటింగ్‌లో 214 పరుగులు చేసిన నైట్ బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది.
చదవండి: T20WC IND Vs PAK: తప్పులు తక్కువ చేసిన జట్టుదే విజయం


